Bakula Medicinal Plant: ప్రతిరోజు రోడ్డు పక్కన అనేక చెట్లను చూస్తూనే ఉంటాం. అయితే వాటివలన కలిగే ప్రయోజనాలు తెలియకపోవడంతో వాటిని పెద్దగా పట్టించుకోం. వాటి ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు. అలాంటి చెట్లలో ఒకటి పొగడ చెట్టు.. ఇది చెట్టు గురించి మన పురాణాల్లో స్వర్గంలో పుష్పించే చెట్టుగా ఉంది. శ్రీకృష్ణుడు బృందావనంలో పొగడ చెట్టు క్రింద వేణువుని ఊదుతూ గోపికలను అలరించేవాడట. ఆయుర్వేద గ్రంధాలైన చరక సంహిత, సుహృత సంహిత ల్లో బకుల అనే పేరుతో ఉపయోగించినట్లు తెలుస్తోంది.
పొగడ చెట్టు ఏప్రిల్ నెలలో పూత పూసి జూన్ నాటికి కాయలు కాస్తుంది. భారతదేశం అంతటా పెరుగుతుంది. దీనిని ఆయా ప్రాంతీయ పేర్లతో పిలుస్తారు. నేలమీద రాలిన సువాసన గల పువ్వులను అందరూ ఇష్టపడతారు. పువ్వులను పోగుచేసి దండలుగా అల్లి అలంకారానికి వాడతారు. ఎండిన కూడా వాసన పోదు కనుక ఈ పువ్వులను నిల్వ చేస్తారు కూడా. ఆయుర్వేద ఔషధాల తయారిలో పొగడ చెట్టు ప్రముఖ పాత్ర వహిస్తుంది. బెరడు, పువ్వులు, కాయలు, పళ్ళు, విత్తనాలు వైద్యానికి పనికివస్తాయి ఈరోజు పొగడ చెట్టు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
ఈ చెట్టు కాయలు అండాకారంలో ఉండి పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగాను పండితే కాషాయం రంగులోనూ ఉంటాయి ఈ పండులో ఒక గింజ లేదా రెండు గింజలు ఉంటాయి. ఈ పండ్ల పై ఉన్న గుజ్జు తియ్యగా ఉంటుంది. కానీ దానిలో ఉండే సాఫోనిన్ అనే రసాయన పదార్థం కారణంగా వీటిని తింటూ ఉంటే కొంచెం వగరుగా అనిపిస్తుంది.
కొంతమంది తలనొప్పి తగ్గడానికి పొగడ పువ్వులను వాసన చూస్తారు.
ఈ చెట్టు బెరడును పేస్ట్ గా చేసి నుదురు మీద రాస్తే తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
ఆయుర్వేదంలో దీనిని చాలా ఎక్కువగా వాడేది దంతసమస్యలకే. బెరడు, పూల కషాయాన్ని పుక్కిలించితే పళ్ళ కురుపులు, నోటిలో దుర్వాసన నోటిపూత మటుమాయం.
దంత సమస్యలకు చక్కటి ఔషధం పొగడ పండ్లు.. చిగుళ్ల వ్యాధులను నివారిస్తాయి. పళ్ళు గట్టిపడతాయి.
పువ్వులు, పళ్ల నుంచి తయారు చేసే లోషన్ ను గాయాలు త్వరగా నయం కావటానికి ఉపయోగిస్తారు.
దంతాలు నుండి రక్తస్రావం అవుతూ ఉంటే ఈ చెట్టు పచ్చి కాయలను నమలాలి. లేదా ఆకులను నమిలితే సమస్య తగ్గిపోతుంది
ఈ పువ్వులను సేకరించి ఎండబెట్టి పొడిగా చేసుకుని నిల్వచేసుకోవాలి ఈ పొడిని చిటికెడు తీసుకొని ఒక గ్లాసు నీటిలో కలిపి తాగుతూ ఉంటే జ్ఞాపకశక్తి సమస్యలు లేకుండా చేస్తుంది.
పూలు, పళ్ళు నుండి తీసిన మందు కురుపులను దెబ్బలను తగ్గిస్తాయి
పొగడ పండ్ల గింజలను దంచి, నేతితో కలిపి మెత్తటి పేస్టుగా చేసి, పిల్లలకి తినిపిస్తే మలబద్ధకం తగ్గి సాఫీగా విరేచనాలు అవుతాయి.
బెరడునుండి తీసిన రంగును అద్దక పరిశ్రమలో వాడతారు.
పూల కాషాయం గుండె వ్యాధులను అరికడుతుంది.
ఆకులు పాము కాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు.
ఈ చెట్టుకలపను గృహుపకరణ వస్తువులు, ఇళ్ళ నిర్మాణ వస్తువుల తయారీతో పాటు.. అనేక విధాలుగా ఉపయోగిస్తారు.