Acidity Problem: ఈ టీతో ఎసిడిటీ సమస్య ఫసక్.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో..! ఇది మీకోసమే..

| Edited By: Anil kumar poka

Jan 25, 2023 | 5:47 PM

ఉబ్బరం వల్ల కడుపు నిండినట్టుగా అనిపిస్తే, ఎసిడిటీ వల్ల కడుపులో మంటగా ఉంటుంది. అలాగే ఛాతిలో నొప్పి వస్తుంది. ముఖ్యంగా పెద్ద వయస్సు ఉన్న వారు ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. అసిడిటీ అనేది తినే ఆహారంపై ప్రభావం మేరకు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియను పట్టించుకోకుండా ఆహారాన్ని తీసుకుంటే ఎసిడిటీ సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Acidity Problem: ఈ టీతో ఎసిడిటీ సమస్య ఫసక్.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో..! ఇది మీకోసమే..
Acidity Problems
Follow us on

ఎసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్యలతో ప్రస్తుతం వయస్సుతో సంబంధ లేకుండా చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. ఉబ్బరం వల్ల కడుపు నిండినట్టుగా అనిపిస్తే, ఎసిడిటీ వల్ల కడుపులో మంటగా ఉంటుంది. అలాగే ఛాతిలో నొప్పి వస్తుంది. ముఖ్యంగా పెద్ద వయస్సు ఉన్న వారు ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. అసిడిటీ అనేది తినే ఆహారంపై ప్రభావం మేరకు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియను పట్టించుకోకుండా ఆహారాన్ని తీసుకుంటే ఎసిడిటీ సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అలాగే అధిక ఒత్తిడి, సరైన శారీరక వ్యాయామం లేకపోవడం వంటి విషయాలు ఎసిడిటీని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఎసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్య నుంచి బయటపడడానికి ఆయుర్వేద వైద్య నిపుణులు మూడు చిట్కాలను చెబుతున్నారు. 12 వారాల పాటు ఈ చిట్కాలను పాటిస్తే ఎసిడిటీ సమస్య నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు. నిపుణులు సూచించే ఆ చిట్కాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

ధనియాల టీ

ప్రతిరోజు ఉదయాన్నే కొత్తిమీర టీ ను తాగితే అద్భుత ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఓ గ్లాసు నీటిని వేడి చేసి అందులో ఓ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి 5 పుదినా ఆకులు, అలాగే రెండు కరివేపాకు రెబ్బలు వేసి ఐదు నిమిషాలు ఉడకబెట్టాలి. అనంతరం వాటిని వడకట్టి తాగాలని సూచిస్తున్నారు. 

సోపు గింజలు

సోపు జీర్ణక్రియకు చాలా సాయం చేస్తుంది. ప్రతి రోజు భోజనం తర్వాత ఓ టేబుల్ స్పూన్ సోపు గింజలకు నమిలితే ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

రోజ్ టీ

ఉదయాన్నే ధనియాల టీ తో రోజు ప్రారంభిస్తే..రాత్రి సమయంలో రోజ్ టీ రోజుకు ముగింపు పలకాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓ గిన్నె 150 ఎంఎల్ నీటిని వేడి చేసి అందులో కొన్ని పొడి గులాబి రేకులను వేసి ఉడికించాలి. తర్వాత వడకట్టుకుని తాగాలి. పడుకునే ముందుకు ఈ టీను తాగితే చాలా ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. 

మరిన్ని హెల్త్ వార్తల కోసం..