ఉసిరికాయతో వీటిని కలిపి పొరపాటున కూడా తినకండి..! ఎప్పుడు.. ఎలా తినాలో తెలుసా..?

ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే కానీ దాన్ని ఎలా తింటామన్నది కూడా ఎంతో ముఖ్యం. కొంతమంది తెలియక లేదా రుచికోసం తప్పుగా కలిపి తినటం వల్ల ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. అందుకే ఉసిరికాయను తినేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసిరికాయతో వీటిని కలిపి పొరపాటున కూడా తినకండి..! ఎప్పుడు.. ఎలా తినాలో తెలుసా..?
Amla Health Benefits

Updated on: Apr 09, 2025 | 3:29 PM

ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిదే.. కానీ దాన్ని ఎలా తింటామో కూడా ముఖ్యమే. కొన్ని పదార్థాలతో ఉసిరికాయను కలిపి తింటే మనం అనుకోనివి జరగవచ్చు. కొందరు రుచి కోసం లేదా తెలియక కలిపి తింటారు. అలా చేస్తే లాభం కాక హాని కలుగుతుంది. కనుక దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.

ఉసిరికాయ తేలికగా ఆమ్లంగా ఉంటుంది. అందుకే ఖాళీ కడుపుతో తింటే గుండెల్లో మంట, అల్సర్ సమస్యలు రావచ్చు. ఉదయం లేచిన వెంటనే తినకూడదు.

పాలు, ఉసిరికాయ రెండూ శరీరానికి ఉపయోగకరమైనవే. కానీ ఈ రెండింటిని కలిపితే గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయి. ఒకేసారి తినకుండా రెండింటి మధ్య కొంత గ్యాప్ ఉండాలి.

కొంతమంది ఉసిరికాయ ముక్కల మీద ఉప్పు చల్లి తింటారు. ఇది రుచికి బాగుంటుంది కానీ పోషకాలు తగ్గిపోతాయి. ఎక్కువ ఉప్పు చల్లడం వల్ల ఆరోగ్య ప్రయోజనం తగ్గిపోతుంది.

ఉసిరికాయ చల్లదనాన్ని కలిగించే పండు. రాత్రిపూట తింటే శరీరాన్ని ఎక్కువగా చల్లబరిచే అవకాశం ఉంటుంది. ఇది తేలికపాటి సమస్యలకే కాదు.. జీర్ణశక్తిపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం తినడం ఉత్తమం.

ఉసిరికాయను మామిడి, అరటిపండ్లు లాంటి పండ్లతో కలిపి తినడం కొందరికి అలవాటు. కానీ ఇవి కలిస్తే జీర్ణశక్తిలో అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు. కొందరికి పొట్టలో నొప్పి, అజీర్ణం వంటివి రావచ్చు.

ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అది శరీరానికి అవసరం. కానీ రోజుకు అధికంగా తింటే అలెర్జీలు, నోరు పుల్లగా ఉండడం వంటి సమస్యలు వస్తాయి. ఏ పదార్థమైనా సమతుల్యంగా తినడం మేలుగా ఉంటుంది.

ఉసిరికాయను తేనెతో కలిపి తినడం చాలా మంచిది. ఇది కేవలం రుచి కోసమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉసిరికాయను కొంచెం మరిగించి సూప్‌లా తినవచ్చు. లేదా చట్నీగా తయారు చేసుకుని భోజనంలో తీసుకోవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)