BMI లేదా బాడీ మాస్ ఇండెక్స్ ఒక వ్యక్తి యొక్క బరువు మరియు ఎత్తు కొలత ఆధారంగా వ్యక్తి యొక్క శరీర కొవ్వు స్థాయిలను అంచనా వేసే పద్ధతి. దేశంలో కరోనా మహమ్మారి కారణంగా దాదాపు ఏడాదికిపైగా అందరూ తమ తమ ఇళ్లకే పరిమితిం అయ్యారు. ఇక పాఠశాలలు సైతం మూతపడ్డాయి. దీంతో పిల్లలు కూడా బయటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో పిల్లల శరీరంపై అధిక ప్రభావం చూపిందని ఒక సర్వే తేల్చింది. ఢిల్లీలో 51శాతం మంది అనారోగ్యకరమైన బాడీ మాస్ ఇండెక్స్ కలిగి ఉన్నారని సర్వే వెల్లడించింది. బరువు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు బరువు పెరగడం ప్రధాన కారణంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడం ద్వారా అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు. శరీర బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ద్వారా మీ బరువు ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఏడాది కాలంలో ఇంట్లో ఉండే పిల్లలు అధిక బరువు, స్థూలకాయం బారిన పడుతున్నట్లు సర్వే అధికారులు గుర్తించారు.
అనారోగ్యకరమైన బీఎంఐ ఉన్న పిల్లల నిష్పత్తి బెంగళూరు, చెన్నైలో 53 శాతంగా ఉన్నట్లు గుర్తించారు. స్పోర్ట్జ్ విలేజ్ స్కూల్స్ నిర్వహించిన పదకొండవ వార్షిక సర్వేలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. గతంలో కంటే ఢిల్లీలో అనారోగ్యకరమైన నిష్పత్తి పెరిగింది. చివరి 12 నెలల సర్వే ప్రకారం చూస్తే.. ఢిల్లీలో 50శాతం యువకులు అనారోగ్యకరమైన బాడీ మాస్ ఇండెక్స్ కలిగి ఉన్నారు. 250 నగరాల్లోని 364 కళాశాలల నుంచి 7 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసు గల 2,54,681 మంది పిల్లలపై దేశ వ్యాప్తంగా సర్వే చేసింది. ఇందులో శరీరంలో కార్డియా సామర్థ్యం, వాయురహిత సామర్థ్యం శరీరక శక్తిని తగ్గించే ఆరోగ్య పారామితులను గుర్తించారు. ఈ సర్వేలో అధిక మంది పిల్లలు శరీరక బరువు, స్థూలకాయం ఉండటం గుర్తించారు.
BMI సమతుల్యంగా ఉన్నవారిలో గుండె జబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు, మధుమేహం వంటివి వచ్చే అవకాశాలు తక్కువ. అందుకే బరువు తగ్గాలనుకునేవారు BMIను ప్రామాణికంగా తీసుకుని కసరత్తులు మొదలుపెట్టాలి. బరువు తగ్గడానికి కొన్ని ఆరోగ్యకరమైన మార్గాలు ఉంటాయి. అయితే బాడీ మాస్ ఇండెక్స్ (BMI) అనేది పిల్లల అధిక బరువు, తక్కువ బరువు లేదా ఆరోగ్యకరమై, బరువు కలిగి ఉన్నారా.. అనేదానిని నిర్ణయించుకునేందుకు ఉపయోగించే సాధనం. బీఎంఐ ఒక సాధారాణ ఫార్ములా ఉపయోగించి పిల్లల ఎత్తు మరియు బరువుతో లెక్కిస్తారు. ఇది శరీర కొవ్వును కొలవదు. కానీ పిల్లల్లో కణజాల ద్రవ్యరాశి (కండర, కొవ్వు మరియు ఎముక) మొత్తం, సాధారణ బరువు, అధిక బరువు, ఊబకాయంలాగా ఉండటం వంటివి గుర్తిస్తారు.
చాలామంది అధిక బరువును తగ్గాలని కోరుకుంటారు. మొదటిది శరీర ద్రవ్యరాశి సూచికను లెక్కించడానికి అందించే ఒక ప్రొఫెషినల్ డైటీషియన్గా మారుతుంది. బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఒక నియత విలువ. ఎందుకంటే ఇది సాధ్యం వ్యక్తిగత సూచికలను పరిగణనలోకి తీసుకోదు. అదే సమయంలో అతను ఒక వ్యక్తి కూర్పు యొక్క సుమారు ఆలోచన ఇస్తుంది. BMI మానవులలో ఊబకాయంను నిర్ధారించడానికి అధికారిక వైద్యంలో ఉపయోగిస్తుంటారు. దీని వల్ల చాలా మందిలో అనేక వ్యాధులు తలెత్తే అవకాశం ఉంటుంది. అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది.