AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asthma Patients Care: మీరు ఆస్తమా ఉందా..? పెరిగిన వాయు కాలుష్యంతో ఇలా జాగ్రత్త పడండి

దీపావళి పండగ సందర్భంగా భారీగా కాలుష్యం ఏర్పడుతుంది. దీని వల్ల వివిధ రకాల వ్యాధులు వస్తుంటాయి. అలాగే ఇతర వ్యాధులున్న వారికి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల..

Asthma Patients Care: మీరు ఆస్తమా ఉందా..? పెరిగిన వాయు కాలుష్యంతో ఇలా జాగ్రత్త పడండి
Asthma Patients
Subhash Goud
|

Updated on: Oct 26, 2022 | 1:12 PM

Share

దీపావళి పండగ సందర్భంగా భారీగా కాలుష్యం ఏర్పడుతుంది. దీని వల్ల వివిధ రకాల వ్యాధులు వస్తుంటాయి. అలాగే ఇతర వ్యాధులున్న వారికి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల దీపావళి తర్వాత కూడా కాలుష్యం ఇంకా ఉంటుంది. అందుకే పలు వ్యాధులున్నవారు జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. ఇక  గొంతు చాలా సున్నితంగా ఉంటే లేదా ఉబ్బసం సమస్య ఉంటే దీపావళి తర్వాత మీరు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు. దగ్గు మళ్లీ మళ్లీ మిమ్మల్ని బాధించదు. చలికాలం ప్రారంభం కావడంతో శ్వాసకోశ సమస్యలు పెరగడంతోపాటు దగ్గు, కఫం, జలుబు చాలా తరచుగా ఇబ్బంది పెడతాయి. కానీ పెరిగిన కాలుష్యం ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తుంది.

ఇంటి గాలిని ఎలా శుభ్రంగా ఉంచాలి

☛ ఉబ్బసం రోగులు, సున్నితమైన గొంతు ఉన్నవారు ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడం మంచిది. ఉదయం, సాయంత్రం అస్సలు బయటకు వెళ్లకపోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రెండు సమయాల్లోనూ కాలుష్యం, పొగ, పొగమంచు సమస్య ఎక్కువగా ఉంటుంది.

☛ ఇంట్లో ఎక్కువ కాలం ఉంటున్నప్పటికీ, ఇంటి గాలి శుభ్రంగా ఉంటుందని గుర్తుంచుకోండి. మీ ఇంట్లో గాలి శుభ్రంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి.

☛ ఇంట్లో పూజ చేసేటప్పుడు అగరబత్తీలు వెలిగించవద్దు. దీపం వెలిగించి, సువాసన కోసం డిఫ్యూజర్‌లో లావెండర్ ఆయిల్ లేదా లెమన్ గ్రాస్ ఆయిల్ ఉపయోగించండి.

☛ లావెండర్ ఆయిల్, లెమన్ గ్రాస్ ఆయిల్ రెండూ ఇంట్లో గాలిని శుభ్రంగా ఉంచడంతో పాటు ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎందుకంటే అవి ఆక్సిజన్ ప్రవాహాన్ని నిర్వహించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి.

☛ కలబంద, బోస్టన్ ఫెర్న్, మనీ ప్లాంట్, తులసి వంటి మొక్కలను ఇంటి లోపల ఉంచండి. వాటిని కిటికీ దగ్గర ఉంచండి. వీటి వల్ల స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి వస్తుంది. ఏవైనా చెడు గాలి వస్తే ఇంట్లోకి రాకుండా ఈ మొక్కలు ఆపగలుగుతాయి.

ఉబ్బసం, సున్నితమైన గొంతు ఉన్నవారు ఏమి తినాలి?

☛ మీరు పప్పు, కూరగాయలలో లవంగాలు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, దాల్చిన చెక్కలను తప్పనిసరిగా ఉపయోగించాలి.

☛ మెంతులను కూడా తినడం అలవాటు చేసుకోవడం మంచిది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి.

☛ అల్లం టీని రోజుకు రెండుసార్లు తాగాలి. పాలు లేకుండా టీ తాగడం సరైనది. అంటే బ్లాక్-టీ.

(ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి