AC for Asthma Patients: ఆస్తమా పేషెంట్లు ఏసీ గదుల్లో కూర్చోవచ్చా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

ఎండలు మండిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో, ఆఫీస్‌ గదుల్లో ఏసీ వేసుకుని సేద తీరుతున్నారు. అయితే ఆస్తమా పేషెంట్లు మాత్రం ఏసీ గదిలో కూర్చునే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎయిర్ కండిషన్డ్ గాలి ఆస్తమా రోగులకు ప్రమాదకరం. సమీపంలోని ధూళి కణాలు AC గాలిలో కరిగి ఆస్తమా రోగులకు హాని కలిగిస్తాయి. ఊపిరి పీల్చుకునే సమయంలో ఆస్తమా రోగుల ఊపిరితిత్తులలో ధూళి కణాలు ప్రవేశిస్తాయి. దానివల్ల వారి సమస్య..

AC for Asthma Patients: ఆస్తమా పేషెంట్లు ఏసీ గదుల్లో కూర్చోవచ్చా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
AC for Asthma Patients

Updated on: Apr 05, 2024 | 8:34 PM

ఎండలు మండిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో, ఆఫీస్‌ గదుల్లో ఏసీ వేసుకుని సేద తీరుతున్నారు. అయితే ఆస్తమా పేషెంట్లు మాత్రం ఏసీ గదిలో కూర్చునే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎయిర్ కండిషన్డ్ గాలి ఆస్తమా రోగులకు ప్రమాదకరం. సమీపంలోని ధూళి కణాలు AC గాలిలో కరిగి ఆస్తమా రోగులకు హాని కలిగిస్తాయి. ఊపిరి పీల్చుకునే సమయంలో ఆస్తమా రోగుల ఊపిరితిత్తులలో ధూళి కణాలు ప్రవేశిస్తాయి. దానివల్ల వారి సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఇది ఆస్తమా రోగిలో ప్రాణాంతకం కూడా కావచ్చు. అందువల్ల ఆస్తమా రోగులు ఏసీలో కూర్చునే ముందు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు.

ఏసీలో కూర్చునే ముందు ఆస్తమా పేషెంట్లు ఏసీ క్లీన్ చేశారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఏసీ మురికిగా ఉంటే గాలితో పాటు దాని దుమ్ము కణాలు కూడా శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితిలో ముందుగా ఏసీని శుభ్రం చేయడం ముఖ్యం. ఆస్తమా వ్యాధిగ్రస్తులు మారుతున్న వాతావరణంలో తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, సమయానికి మందులు తీసుకోవడం అత్యంత అవసరం అని ఢిల్లీ సీనియర్ వైద్యుడు డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు.

AC ధూళి కణాల నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలంటే

దీన్ని నివారించడానికి ఏకైక మార్గం ఏసీని శుభ్రంగా ఉంచుకోవడం. ACని శుభ్రంగా ఉంచడానికి, దాని ఎయిర్ ఫిల్టర్‌ను శుభ్రం చేసుకోవాలి. AC ఉష్ణోగ్రత 25 డిగ్రీలు ఉండేలా చేసుకోవాలి. ఒకవేళ మీరు కొత్త ఏసీని కొనాలని భావిస్తే ఎయిర్ ప్యూరిఫైయర్ ఉన్న ఏసీని కొనుగోలు చేయడం బెటర్‌. ఆస్తమా పేషెంట్‌కు సమస్య తీవ్రంగా ఉంటే, మాస్క్ ధరించి ACలో కూర్చోవచ్చు. అలాగేఇన్‌హేలర్‌ను మీతో ఉంచుకోవాలి.

అసలు ఆస్తమా ఎందుకు వస్తుంది?

ఆస్తమా ఒక ప్రమాదకరమైన వ్యాధి. ఆస్తమా వల్ల శ్వాసనాళంలో వాపు సంభవిస్తుంది. దీని వల్ల ఊపిరితిత్తులకు కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ కారణంగా వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. దీనితో పాటు శ్వాస తీసుకునేటప్పుడు శ్వాసలో గురక శబ్దం, నిరంతర దగ్గు సమస్య వస్తుంది. కొంతమంది రోగులలో పొడి దగ్గు ఉంటుంది. నిద్రలో కూడా దగ్గు ఎక్కువగా వస్తుంది.

ఆస్తమాను ఎలా నివారించాలి?

  • దుమ్ము, ధూళి, పొగకు దూరంగా ఉండాలి
  • బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలి
  • మందులను సమయానికి తీసుకోవాలి
  • ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.