హైదరాబాద్‌లో మరో గుండె మార్పిడికి ఏర్పాట్లు.. గచ్చిబౌలి కాంటినెంటల్ నుంచి బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్‌కి..
Heart Transplant:హైదరాబాద్ నగరంలో మంగళవారం తొలిసారి మెట్రో రైల్‌లో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి గుండెను తరలించిన విషయం తెలిసిందే.
Heart Transplant:హైదరాబాద్ నగరంలో మంగళవారం తొలిసారి మెట్రో రైల్‌లో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి గుండెను తరలించిన విషయం తెలిసిందే. నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ వరకు మెట్రో ఎక్కడా ఆగకుండా పరుగులు తీసింది. కామినేని ఆస్పత్రి నుంచి నాగోల్ వరకు అంబులెన్స్‌లో ఆ తర్వాత నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకూ మెట్రో సర్వీసులో.. ఇక జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి అపోలో ఆసుపత్రి వరకు రోడ్డుపై గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తరలించారు.
ఈ విషయం మరవక ముందే మరో గుండె మార్పిడికి వైద్యసిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. 51 సంవత్సరాల వ్యక్తి నుంచి గుండె సేకరించి గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్ లోని కేర్ హాస్పిటల్‌కి తరలింపు చేయబోతున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సమన్వయంతో కేవలం 19 నిమిషాల్లో గుండె తరలింపు చేయనున్నారు. అంతేకాకుండా అదే కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి ఊపిరితిత్తులను కిమ్స్ హాస్పిటల్ కి తరలించే ప్రక్రియ కూడా చేపట్టనున్నారని తెలుస్తోంది. మంచి మనసుతో అవయవదానానికి ముందుకురావడంతో మరో ప్రాణం నిలబడుతుంది. ఇందుకు వైద్యులు కూడా తమ వంతు పాత్ర పోషించడంతో పలువురు ఈ ప్రక్రియను అభినందిస్తున్నారు.