Wearing a Bra at Night: రాత్రిళ్లు కూడా బ్రా వేసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!!

|

Aug 15, 2023 | 8:43 PM

మగువలకు అందంపై మమకారం ఎక్కువ. కడుపునిండా ఆహారం లేకపోయినా ఉండగలరేమో గాని.. అందంగా కనిపించకపోతే అరక్షణం కూడా ఉండలేరు. అందుకే మహిళలను అలంకార ప్రియులంటారు. మేకప్ లు, లిప్ స్టిక్ లు, మాయిశ్చరైజర్లు, హెయిల్ స్టైల్ చేసుకోవడంతో పాటు.. సందర్భానికి తగ్గట్టుగా డ్రస్సింగ్ చేసుకోవడం మగువలకు ఎంతో ఇష్టం. ఆఫీస్ లు, ఫంక్షన్లు, పండుగలు, టూర్లకు వెళ్లేటపుడు.. ఇలా ఒక్కో సందర్భానికి ఒక్కోలా రెడీ అవుతుంటారు. చీర, కుర్తీ..

Wearing a Bra at Night: రాత్రిళ్లు కూడా బ్రా వేసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!!
Wear Bra At Night
Follow us on

మగువలకు అందంపై మమకారం ఎక్కువ. కడుపునిండా ఆహారం లేకపోయినా ఉండగలరేమో గాని.. అందంగా కనిపించకపోతే అరక్షణం కూడా ఉండలేరు. అందుకే మహిళలను అలంకార ప్రియులంటారు. మేకప్ లు, లిప్ స్టిక్ లు, మాయిశ్చరైజర్లు, హెయిల్ స్టైల్ చేసుకోవడంతో పాటు.. సందర్భానికి తగ్గట్టుగా డ్రస్సింగ్ చేసుకోవడం మగువలకు ఎంతో ఇష్టం. ఆఫీస్ లు, ఫంక్షన్లు, పండుగలు, టూర్లకు వెళ్లేటపుడు.. ఇలా ఒక్కో సందర్భానికి ఒక్కోలా రెడీ అవుతుంటారు. చీర, కుర్తీ, మిడ్డీ, గౌన్లు, జీన్స్.. ఇలా డ్రస్ ఏదైనా కంఫర్ట బులిటీ చూసుకుంటారు. వాటికి తగ్గట్టుగానే ఇన్నర్స్ కూడా ధరిస్తారు.

శరీర అవయవాలను లో దుస్తులు కప్పి ఉంచుతాయి కాబట్టి వాటిని ధరించేందుకు ఏ మాత్రం మోహమాటపడరు. కానీ.. కొందరు మహిళలు లో దుస్తులు ధరించే విషయంలో కొన్ని తప్పులు చేస్తున్నారు. బయటకు వెళ్లేటపుడే కాకుండా.. రాత్రివేళ పడుకునే సమయంలో కూడా బ్రా ధరిస్తున్నారు. ఇలా 24 గంటల పాటు శరీరంపై బిగుతుగా ఉండే లో దుస్తులు ధరించడం వల్ల మీకే తెలియకుండా అనారోగ్యం బారిన పడతారని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

రాత్రివేళల్లో నైటీలు, నైట్ డ్రస్ లు లేదా గృహిణులైతే చీరలు ధరించే నిద్రపోతుంటారు. అప్పుడు కూడా లో దుస్తులు ధరించి పడుకుంటే.. మీ వక్షోజాల సైజు మారుతుంది. అంతే కాదు.. త్వరగా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని ఓ అధ్యయనంలో తేలింది. అంతగా బ్రా ధరించే పడుకోవాలనుకుంటే.. స్పోర్ట్ బ్రా వేసుకోవచ్చని సూచిస్తున్నారు. బ్రా లు బిగుతుగా ఉంటాయి కాబట్టి.. రక్తప్రసరణ సరిగ్గా జరగక.. గాలి కూడా సరిగ్గా తగలక చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఆ ప్రాంతంలో చర్మం నల్లగా మారి అసహ్యంగా కనిపిస్తుంది. కాబట్టి రాత్రి సమయాల్లో మహిళలు బ్రా లు ధరించే అలవాటును మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిళ్లు వీలైనంత వరకూ వదులుగా ఉండే దుస్తుల్ని ధరించడమే ఆరోగ్యానికి మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి