Banana: సైనస్ తో బాధ పడుతున్నారా.. అయితే అరటి పండు అస్సలు తినకండి!

అరటి పండులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బనానా అంటే అందరికీ ఇష్టమే. అందరికీ అందుబాటులో ఉండేది కూడా అరటి పండునే. బనానాలో పుష్కలంగా ప్రయోజనాలు ఉన్నాయి. సంవత్సరం పిల్లలకు కూడా అరటి పండును ఆహారంగా ఇస్తే జీర్ణ సమస్యలు, మలబద్ధకం సమస్యలు ఉండవు. చిన్న పిల్లలకు రోజూ ఒక అరటి పండును తినిపిస్తే చాలా హెల్దీ. అలాగే బరువుగా తయారవుతారు. బనానాలో క్యాల్షియం,..

Banana: సైనస్ తో బాధ పడుతున్నారా.. అయితే అరటి పండు అస్సలు తినకండి!
Banana

Edited By: Ravi Kiran

Updated on: Sep 23, 2023 | 7:30 PM

అరటి పండులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బనానా అంటే అందరికీ ఇష్టమే. అందరికీ అందుబాటులో ఉండేది కూడా అరటి పండునే. బనానాలో పుష్కలంగా ప్రయోజనాలు ఉన్నాయి. సంవత్సరం పిల్లలకు కూడా అరటి పండును ఆహారంగా ఇస్తే జీర్ణ సమస్యలు, మలబద్ధకం సమస్యలు ఉండవు. చిన్న పిల్లలకు రోజూ ఒక అరటి పండును తినిపిస్తే చాలా హెల్దీ. అలాగే బరువుగా తయారవుతారు. బనానాలో క్యాల్షియం, పొటాషియం, ఐరన్, ఫోలేట్, విటమిన్ బి, నియాసిన్, మెగ్నిషియం, మాంగనీసం, రైబో ప్లేవిన్ అనే పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి.

బనానా తినడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. అలాగే రక్త పోటు కంట్రోల్ లో ఉంటుంది. గుండె కొట్టుకునే వేగాన్ని అదుపులో ఉంచుతుంది అరటి పండు. ఇంకా నిద్ర పట్టే విధంగా కూడా దోహద పడుతుంది బనానా. అరటి పండు తినడం వల్ల ఎముకలు కూడా దృఢంగా, బలంగా తయారవుతాయి. బనానాతో బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు. ఎందుకంటే అరటి పండు ఒక్కటి తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో వేరే వాటిని తినలేం. దీంతో బరువు కంట్రోల్ లో ఉంటుంది. అందరూ తినే పండు అరటి పండు. అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధ పడేవారు మాత్రం బనాను దూరంగా ఉంచాలి. మరి ఆ సమస్యలు ఏంటో తెలసుకుందాం.

శ్వాస సమస్యలు:

ఇవి కూడా చదవండి

శ్వాసకోశ సమస్యలు అయిన దగ్గు, జలుబు వంటి వాటితో బాధపడేవారు అరటి పండుకు దూరంగా ఉంటేనే మంచిది. ఈ సమస్యలతో ఉన్న వారు తింటే దగ్గ, జలుబు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది.

సైనస్:

సైనస్ ఉన్న వారు కూడా అరటి పండుకు దూరంగా ఉండాలి. ఊపిరి తిత్తుల్లో శ్లేష్మం ఉండే వారు కూడా బనానాకు చాలా దూరంగా ఉండాలి. ఎప్పుడో ఒకటి తింటే పర్వాలేదు కానీ.. తరచూ తింటే మాత్రం ప్రమాదం తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అరటి పండు తినడం వల్ల ఊపిరి తిత్తుల్లో శ్లేష్మం మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.