Hair Problems: జుట్టు విపరీతంగా రాలుతుందని బాధపడుతున్నారా.. ఈసారి ఈ సింపుల్ చిట్కా పాటించండి!!

|

Aug 27, 2023 | 12:39 PM

మనల్ని మరింత అందంగా కనిపించడంలో జుట్టు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖం ఎంత మెరిస్తున్నా.. అసలైన అందం జుట్టుతోనే వస్తుంది. రకరకాల హెయిర్ స్టైల్స్ తో ముఖానికి మరింత అందం జోడవుతుంది. అబ్బాయిలు అయినా.. అమ్మాయిలు అయినా.. తమ కేశాల మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. జుట్టు రాలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులోనూ ఒత్తిడి, ఆహారపు అలవాట్లు ముఖ్య కారణం. మంచి ఆహారంతో పాటు ఒత్తిడిని తగ్గించుకుంటే.. ఒత్తైన నిగనిగలాడే జుట్టు మన సొంతం అవుతుంది. జుట్టు అధికంగా రాలడానికి కారణం పోషకాహార లోపం. సాధారణంగా రోజుకు 50-100..

Hair Problems: జుట్టు విపరీతంగా రాలుతుందని బాధపడుతున్నారా.. ఈసారి ఈ సింపుల్ చిట్కా పాటించండి!!
జుట్టు సమస్యలు: బాదం పప్పుల్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా జుట్టు సమస్యలు ఉన్నవారు పరిమిత మోతాదులో అంటే రోజుకు 10 బాదం పప్పుల వరకు తినవచ్చు. అంతకమించి తీసుకుంటే విటమిన్ ఇ మోతాదు పెరిగి, అతిసారం, దృష్టి లోపాలతో పాటు జుట్టు, చర్మ సమస్యలు అధికం అవుతాయి.
Follow us on

మనల్ని మరింత అందంగా కనిపించడంలో జుట్టు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖం ఎంత మెరిస్తున్నా.. అసలైన అందం జుట్టుతోనే వస్తుంది. రకరకాల హెయిర్ స్టైల్స్ తో ముఖానికి మరింత అందం జోడవుతుంది. అబ్బాయిలు అయినా.. అమ్మాయిలు అయినా.. తమ కేశాల మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. జుట్టు రాలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులోనూ ఒత్తిడి, ఆహారపు అలవాట్లు ముఖ్య కారణం. మంచి ఆహారంతో పాటు ఒత్తిడిని తగ్గించుకుంటే.. ఒత్తైన నిగనిగలాడే జుట్టు మన సొంతం అవుతుంది. జుట్టు అధికంగా రాలడానికి కారణం పోషకాహార లోపం. సాధారణంగా రోజుకు 50-100 వెంట్రుకలు రాలుతాయి. అయితే వందకు మించి రాలితే దాన్ని జుట్టు రాలడం అంటారు.

జుట్టు రాలడాన్ని అదుపు చేసేందుకు ఇప్పటికే ఎన్నో పద్దతులను, చిట్కాలను పాటించి విసుగు చెందారా.. అయితే ఈ సారి ఈ సింపుల్ చిట్కా పాటించండి. ఈ సమస్యలన్నీ దూరం చేసుకోండి. అందులోనూ ప్రస్తుతం ఉన్న వర్షాకాలంలో కారణం లేకుండానే జుట్టు విపరీతంగా రాలుతుంది. కొబ్బరి నూనె-మెంతులతో జుట్టుకు మంచి పోషణ అందించవచ్చు. దీంతో జుట్టు రాలడం కంట్రోల్ అవ్వడమే కాకుండా.. షైనీగా ఉంటుంది. మరి ఆ హెయిర్ ప్యాక్ ఎలా చేసుకోవాలో చూద్దాం:

కొబ్బరినూనె-మెంతులు హెయిర్ ప్యాక్ తయారీ విధానం:

ఇవి కూడా చదవండి

ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకోండి. దానికి 1 టీస్పూన్ మెంతి పొడిని కలపాలి. ఈ రెండింటిని బాగా కలిపి గ్యాస్, మైక్రోవేవ్ లేదా ఓవెన్ లో కొన్ని సెకన్ల పాటు వేడి చేసుకోవాలి. ఈ మిశ్రమం గోరు వెచ్చగా ఉన్నప్పుడు.. జుట్టు మొత్తం, కుదుళ్లకు బాగా పట్టించి, ఓ ఐదు నిమిషాల పాటు మెల్లగా మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల రిలీఫ్ గా కూడా ఉంటుంది. ఓ అరగంట తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో, గోరు వెచ్చటి నూనెతో తలస్నానం చేసుకోవాలి. ఇలా వారానికి ఒక్కసారైనా ఈ ప్యాక్ వేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

కొబ్బరినూనె-మెంతులు ప్యాక్ ప్రయోజనాలు:

కొబ్బరి నూనె, మెంతుల కలయిన జుట్టు కుదుళ్లను బాగా బలపరుస్తుంది. జుల్ల రాలడాన్ని, చివర్లు చిట్లడాన్ని తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలకు కూడా ఈ ప్యాక్ చక్కగా పని చేస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ తో మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీన్ని తరుచుగా వేసుకుంటే జుట్టు షైనీగా, సిల్కీగా ఉంటుంది. కొబ్బరి నూనె, మెంతులు రెండూ యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి చుండ్రును, దురదను తగ్గించడంలో సహాయపడతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి