Health Tips: మీకు 40 ఏళ్లు దాటాయా? అయితే ఈ సమస్యలు ఖచ్చితంగా వస్తాయి!!

|

Jul 25, 2023 | 10:13 PM

మీకు 40 ఏళ్లు దాటాయా? అయితే మీరు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిందే. ముందే మీరు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. ఆ తర్వాత పెద్ద సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా స్త్రీల కంటే పురుషులకి 40 ఏళ్లు దాటితే చాలా రకాలైన సమస్యలు..

Health Tips: మీకు 40 ఏళ్లు దాటాయా? అయితే ఈ సమస్యలు ఖచ్చితంగా వస్తాయి!!
Health Tips
Follow us on

మీకు 40 ఏళ్లు దాటాయా? అయితే మీరు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిందే. ముందే మీరు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. ఆ తర్వాత పెద్ద సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా స్త్రీల కంటే పురుషులకి 40 ఏళ్లు దాటితే చాలా రకాలైన సమస్యలు వస్తాయి. మరి అవేంటో.. ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

-యువకుల కంటే 40 ఏళ్లు పైబడిన పురుషులలో తలనొప్పి సమస్య ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

-40 ఏళ్ల తర్వాత అజీర్ణం వల్ల గుండెల్లో మంట సమస్య వస్తుంది.

ఇవి కూడా చదవండి

-40 ఏళ్లు పైబడిన చాలా మంది పురుషులకు పొట్ట ఎక్కువగా వస్తుంది.

-ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన పురుషులు ఎక్కువగా జీవక్రియ సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది.

-పురషులకు 40 ఏళ్లు దాటిన తర్వాత.. వెన్నునొప్పి సాధారణగా వచ్చే సమస్య. ఎక్కువగా వాహనాలు నడిపే వారికి వెన్నునొప్పి వచ్చే ముప్పు ఇంకా పెరుగుతుంది.

-వయస్సు పైబడే కొద్దీ కీళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి. కాల్షియం లోపం కారణంగా.. ఎముకల సాంద్రత తగ్గుతుంది.

-40 ఏళ్ల తర్వాత మగవారికి టెస్టిక్యులర్‌ క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుంది. దీన్ని లక్షణాలు మొదట్లోనే గుర్తిస్తే.. విజయంతంగా చికిత్స చేయవచ్చు.

ముందుగానే పరుషులు కాస్త జాగ్రత్తలు పాటిస్తే వీటన్నింటికీ చెక్ పెట్టవచ్చు. ఉదయాన్నే పలు వ్యాయామాలు, వాకింగ్ చేస్తూ మంచి సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి దూరంగా ఉంటారు. అప్పుడప్పుడు హెల్త్ చెకప్ చేయించుకున్నా కూడా మంచిదే.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..