Leg Pain: నడుస్తున్నప్పుడు కాళ్లలో నొప్పిగా ఉందా? తస్మాత్‌ జాగ్రత్త.. ఆ ప్రమాదకర సమస్యలకు సంకేతం కావచ్చు

|

Nov 08, 2022 | 1:04 PM

అధిక కోలెస్ట్రాల్ కారణంగా రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఇది క్రమంగా స్ట్రోక్, ఛాతీ నొప్పి, గుండెపోటుతో సహా పలు గుండె సమస్యలకు దారి తీస్తుంది. అందుకే శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే, దానిని త్వరగా గుర్తించడం ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Leg Pain: నడుస్తున్నప్పుడు కాళ్లలో నొప్పిగా ఉందా? తస్మాత్‌ జాగ్రత్త.. ఆ ప్రమాదకర సమస్యలకు సంకేతం కావచ్చు
Leg Pain
Follow us on

అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లతో శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరుగుతున్నాయి. కొవ్వు పదార్థాలు, జంక్ ఫుడ్, వ్యాయామం లేకపోవడం, ధూమపానం అధిక మద్యపానం వంటివి అధిక కొలెస్ట్రాల్‌కు ప్రధాన కారణాలు. చాలామంది వీటిని పట్టించుకోకపోవడంతో చిన్న వయసులోనే ఊబకాయం, ఒటెసిటీ, మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యల బారిన పడుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. చాలా మందికి అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు లేనప్పటికీ, అది రక్త నాళాలలో పేరుకుపోతుంది. ఫలితంగా, రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఇది క్రమంగా స్ట్రోక్, ఛాతీ నొప్పి, గుండెపోటుతో సహా పలు గుండె సమస్యలకు దారి తీస్తుంది. అందుకే శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే, దానిని త్వరగా గుర్తించడం ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ లక్షణాలను ముందస్తుగా గుర్తించడం వలన ప్రాణాంతక పరిస్థితులను నివారించవచ్చని సూచిస్తున్నారు.

కాగా నడుస్తున్నప్పుడు మీకు కాళ్లలో నొప్పి ఉంటే అది అధిక కొలెస్ట్రాల్ లక్షణం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొలెస్ట్రాల్ స్థాయి ప్రమాదకర స్థాయికి చేరుకునే వరకు, దాని ప్రారంభ లక్షణాలు కనిపించవు. అయితే ఈ సమయంలో, ఇది మన శరీరంపై కొద్దిగా ప్రభావాన్ని చూపుతుంది. కొలెస్ట్రాల్‌ను గుర్తించడానికి రక్త పరీక్షలు మాత్రమే సాధ్యమవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు, కాళ్లపై కూడా ప్రతికూల ప్రబావం పడుతుంది. దీనిని గుర్తించకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారవచ్చు. గోళ్లతో పాటు పాదాల చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు శరీరం అంతటా ఆక్సిజన్ సరిగ్గా సరఫరా కావట్లేదని అర్థం. ఇది చర్మం, గోళ్ల రంగులో మార్పులకు కారణమవుతుంది. వాటిలో కొన్ని పసుపు లేదా ఊదా రంగులో కనిపిస్తాయి.

కాళ్ల నొప్పులు పెరుగుతాయి..

కాళ్లలో ప్రవహించే రక్తంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల కాళ్ల నొప్పులు మొదలవుతాయి. ఫలితంగా కొద్ది దూరం నడిచినవెంటనే తీవ్ర అలసటకు గురవుతారు. ఎక్కువ బరువును మోస్తున్నట్లు ఫీలవుతారు. ఇక అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి పాదాలలో వాపు సమస్యలు ఉండవచ్చు. ఈ లక్షణాలతో పాటు, అదనపు కొవ్వు వల్ల అరికాళ్లలో నొప్పి కూడా కనిపిస్తుంది. అందుకే ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..