Facts About Brown Bread: బ్రౌన్ బ్రెడ్ తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!!

| Edited By: Ravi Kiran

Sep 11, 2023 | 4:30 AM

ఈ మధ్య కాలంలో చాలా మంది తమ బ్రేక్ ఫాస్ట్ లో బ్రౌన్ బ్రెడ్ ను తీసుకుంటున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా బ్రౌన్ బ్రెడ్ వినియోగం భారత దేశంలో విపరీతంగా పెరిగింది. చాలా మంది బ్రౌన్ బ్రెడ్ తినడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో, ఈవినింగ్ స్నాక్ రూపంలో ఇలా బ్రెడ్ ను తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కారణంగా.. చాలా మంది టిఫిన్ గా బ్రౌన్ బ్రెడ్ టోస్ట్ లా కానీ, ఆమ్లెట్ తో సరి పెట్టుకుంటున్నారు. కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే.. బ్రెడ్ లో ఎక్కువగా మైదా ఉంటుంది. ఇది ఎక్కువగా తీసుకుంటే గుండె సమస్యలు, రక్త పోటు వచ్చే అవకాశాలు..

Facts About Brown Bread: బ్రౌన్ బ్రెడ్ తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!!
Brown Bread
Follow us on

ఈ మధ్య కాలంలో చాలా మంది తమ బ్రేక్ ఫాస్ట్ లో బ్రౌన్ బ్రెడ్ ను తీసుకుంటున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా బ్రౌన్ బ్రెడ్ వినియోగం భారత దేశంలో విపరీతంగా పెరిగింది. చాలా మంది బ్రౌన్ బ్రెడ్ తినడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో, ఈవినింగ్ స్నాక్ రూపంలో ఇలా బ్రెడ్ ను తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కారణంగా.. చాలా మంది టిఫిన్ గా బ్రౌన్ బ్రెడ్ టోస్ట్ లా కానీ, ఆమ్లెట్ తో సరి పెట్టుకుంటున్నారు. కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే.. బ్రెడ్ లో ఎక్కువగా మైదా ఉంటుంది. ఇది ఎక్కువగా తీసుకుంటే గుండె సమస్యలు, రక్త పోటు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బ్రెడ్ లో ఉన్న పిండి పదార్థం.. తిన్న వెంటనే రక్తంలో కలిసిపోతుంది. ఇది చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఎక్కువగా బ్రెడ్ తింటే ఊబకాయం కూడా వచ్చే ఛాన్స్ మెండుగా ఉన్నాయి.

బ్రౌన్ బ్రెడ్ మంచిదేనా..

బ్రౌన్ బ్రెడ్ తో పోలిస్తే వైట్ బ్రెడ్ తినడం అంత సేఫ్ కాదు. వైట్ బ్రెడ్ లో విటమిన్స్, మినరల్స్, పోషకాలు పెద్దగా ఏమీ ఉండవు. వైట్ బ్రెడ్ లో మైదాను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫైబర్ కూడా ఉండదు.. దాని కారణంగా జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. అయితే వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ తీసుకోవడం మంచిదే. కానీ తక్కువ మోతాదులోనే తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

-బ్రౌన్ బ్రెడ్ తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఇందుల కల్తీ జరిగే అవకాశం ఉంది. వైట్ బ్రెడ్ కే బ్రౌన్ కలర్ వేసి అమ్ముతారు. కాబట్టి మీరు కొనేముందు చెక్ చేసుకుని తీసుకోవడం ఉత్తమం.

-బ్రౌన్ బ్రెడ్ ను గోధుమలు, నీళ్లు, ఉప్పు, చక్కెర, ఈస్ట్ ని ఉపయోగించి తయారు చేస్తారు. ఇవన్నీ ప్యాకెట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి.

– బ్రౌన్ బ్రెడ్ లో మల్టీ గ్రెయిన్ తీసుకోవాలి. ఇందులో జింక్, కాపర్, ఐరన్, మెగ్నీషియం వంటి సూక్ష్మ పోషకాలు ుంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

-బ్రౌన్ బ్రెడ్ లో ధాన్యం ఉంటుంది కాబట్టి.. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

– ప్రతి రోజూ తగిన మోతాదులో బ్రౌన్ బ్రెడ్ ను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ కే, ఈ, బీ, కార్బొహైడ్రేట్లు, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు లభిస్తాయి.

-అధిక బరువుతో బాధపడే వారు.. బరువు తగ్గాలంటే వారికి బ్రౌన్ బ్రెడ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే వైద్యుల సూచనల మేరకు తీసుకోవాలి.

-బ్రౌన్ బ్రెడ్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే గోధుమ పిండిలోని పీచు పదార్థం పేగు కదలికలకు సహాయపడుతుంది. కాబట్టి జీర్ణ క్రియ, పేగులు ఆరోగ్యంగా ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి