Amla Benefits: ఉసిరి ఆరోగ్య సిరి.. దీన్ని రోజూ తీసుకుంటే ఆ అనారోగ్య సమస్యలు ఫసక్..

|

Dec 10, 2022 | 1:42 PM

Amla Health Benefits: ప్రతి రోజూ మన ఆహారంలో ఉసిరి చేర్చుకోవడం వల్ల కలిగే లాభాలను తెలుసుకుంటే నోరెళ్లబెడతారు. మన పెరట్లో దొరికేదే కదా అని చాలా మంది ఉసిరిని లైట్ తీసుకుంటారు. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం ఆహారంలో ఉసిరిని తీసుకోవడం చాలా మేలని సూచిస్తున్నారు.

Amla Benefits: ఉసిరి ఆరోగ్య సిరి.. దీన్ని రోజూ తీసుకుంటే ఆ అనారోగ్య సమస్యలు ఫసక్..
Amla Benefits
Image Credit source: TV9 Telugu
Follow us on

Amla Health Benefits: ప్రతి రోజూ మన ఆహారంలో ఉసిరి చేర్చుకోవడం వల్ల కలిగే లాభాలను తెలుసుకుంటే నోరెళ్లబెడతారు. మన పెరట్లో దొరికేదే కదా అని చాలా మంది ఉసిరిని లైట్ తీసుకుంటారు. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం ఆహారంలో ఉసిరిని తీసుకోవడం చాలా మేలని సూచిస్తున్నారు. ఉసిరి అనేది సర్వరోగ నివారిణి అని అది శరీరానికి ఒక ట్యాబ్లెట్లా పని చేస్తుందని వివరిస్తున్నారు. జలుబు నుంచి మధుమేహం వరకూ, అలాగే జుట్టు పోషణ నుంచి మలబద్ధక నివారణ వరకూ ఉసిరి మేలు చేస్తుందని పేర్కొంటున్నారు. అందుకే మీ రెగ్యులర్ డైట్‌లో ఉసిరి ఉండేలా చూసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

ఉసిరి వల్ల ఈ లాభాలు ఉన్నాయని మీకు తెలుసా?

కాలేయ సమస్యలు దూరం

ఉసిరి కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ఉసిరిలో క్వెర్సెటిన్, గల్లిక్ యాసిడ్, కొరిలాగిన్, ఎల్లాజిక్ యాసిడ్స్ వంటి ఫైటోకెమికల్స్ మంచి మొత్తంలో ఉన్నాయి. ఇవి శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేసి, కాలేయ పని తీరును మెరుగు పర్చడానికి దోహదం చేస్తుంది. కాలేయ సమస్యలున్నవారికి ఉసిరి ఓ రకంగా దివ్యౌషధమని పలు పరిశోధనల్లోనూ తేల్చారు.

షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్యౌధం

షుగర్ వ్యాధిగ్రస్తులు ఉసిరి తీసుకోవడం వల్ల రక్తం గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. ఉసిరిలో ఉండే క్రోమియం అనే మినరల్ శరీరం యాంటి డయాబెటిక్ ప్రభావానికి గురయ్యేలా చేస్తుంది. అందుకే షుగర్ వ్యాధిగ్రస్తులు మీ రెగ్యులర్ డైట్‌లో ఉసిరి కూడా ఉండేలా ప్లాన్ చేసుకోవాలని పౌష్ఠికాహార నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

హెయిర్ ఫాల్ దరి చేరదు

ఉసిరి వల్ల హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. ఉసిరిలో ఉండే ఆమ్లసారం వివిధ ఎంజైమ్ల పని తీరును మందగించేలా చేసి జుట్టు పోషణకు అవసరమయ్యే హెయిర్ ఫోలికల్ కణాలను విస్తరిస్తుంది. దీంతో హెయిర్ ఫాల్ సమస్య తగ్గి, జట్టు ఒత్తుగా పెరుగుతుంది. అందుకే మీ డైట్‌లో ఉసిరిని చేర్చుకుంటే మీ కురులకు ఎంతో మేలు జరుగుతుంది.

బరువు తగ్గడానికి దోహదం

ఉసిరి తినడం వల్ల బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో అధిక కొలేస్ట్రాల్ నియత్రించడంలో ఉసిరి సాయపడుతుంది. ఉసిరి శరీరంలో పీపీఏఆర్ స్థాయిని పెంచుతుంది. తద్వారా ఎల్ డీ ఎల్, వీ ఎల్ డీ ఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతో పాటు ట్రై గ్లిజరాయిడ్స్ స్థాయిని కూడా తగ్గిస్తుంది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ చదవండి..