Health Benefits of Goat Milk: మేకపాలు తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. ఈ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు!!

|

Aug 18, 2023 | 5:33 PM

సాధారణంగా మనం ఆవు పాలు, గేదె పాలను రోజూ ఉపయోగిస్తుంటాం. టీ, కాఫీ, పాలు, పెరుగు ఇలా అన్నింటికీ మనకు అందుబాటులో ఉన్న వాటి పాలను వాడుకుంటాం. కానీ ఇప్పుడు పాలు కూడా కల్తీ అయిపోయాయి. ఏవి మంచి పాలో, ఏవి కల్తీపాలో కూడా గుర్తించడం కష్టమవుతోంది. అందుకే పాలు తాగాలన్నా భయపడుతుంటారు. కానీ ఆవు పాలు, గేదె పాలకంటే.. మేక పాలల్లో రోగనిరోధశక్తినిచ్చే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పైగా ఇది సీజనల్ వ్యాధుల కాలం కాబట్టి..

Health Benefits of Goat Milk: మేకపాలు తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. ఈ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు!!
Goat Milk Benefits
Follow us on

సాధారణంగా మనం ఆవు పాలు, గేదె పాలను రోజూ ఉపయోగిస్తుంటాం. టీ, కాఫీ, పాలు, పెరుగు ఇలా అన్నింటికీ మనకు అందుబాటులో ఉన్న వాటి పాలను వాడుకుంటాం. కానీ ఇప్పుడు పాలు కూడా కల్తీ అయిపోయాయి. ఏవి మంచి పాలో, ఏవి కల్తీపాలో కూడా గుర్తించడం కష్టమవుతోంది. అందుకే పాలు తాగాలన్నా భయపడుతుంటారు. కానీ ఆవు పాలు, గేదె పాలకంటే.. మేక పాలల్లో రోగనిరోధశక్తినిచ్చే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పైగా ఇది సీజనల్ వ్యాధుల కాలం కాబట్టి.. ఈ కాలంలో మేక పాలు తాగితే అంటువ్యాధులు రాకుండా ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మేకపాలలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి కడుపులో మంటను తగ్గిస్తాయి. అలాగే ప్రేగు వ్యాధి వల్ల వచ్చే వాపు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఎక్కువగా ఆందోళన చెందడం, డిప్రెషన్ కు గురవ్వడం, ఇతర మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు మేకపాలు తాగితే.. ఆ లక్షణాల నుంచి త్వరగా బయట పడతారు. మేక పాలు శరీరంలో కొన్ని హార్మోన్లను విడుదల చేయడం ద్వారా మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. అలాగే ముఖ్యంగా డెంగ్యూ బారిన పడినవారికి మేక పాలు తాగిస్తే.. త్వరగా కోలుకుంటారు.

అలాగే వీటిలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. అవి శరీరంలో రక్త హీనతను తొలగించడంలో సహాయపడుతాయి. శరీరానికి ఐరన్ ను అందించడంతో పాటు ఎర్ర రక్త కణాలను పెంచుతాయి. కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవారు మేకపాలు తాగితే.. కొద్ది రోజుల్లోనే మార్పు వస్తుంది. మేక పాలలో ఉండే అధిక కాల్షియం కీళ్లు, ఎముకలను బలపరిచి.. నొప్పిని తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ నొప్పితో బాధపడేవారు కూడా మేకపాలను ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఒక కప్పు మేకపాలల్లో.. 156 కేలరీల శక్తి ఉంటుంది. 8 గ్రాముల ప్రొటీన్, 9 గ్రాముల కొవ్వులు, 10 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 10 గ్రాముల చక్కెర, 300 మి.గ్రా.కాల్షియం, 115మిల్లీ గ్రాముల సోడియం, 2.9 మి.గ్రా. విటమిన్ సి, 24 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి