Guava Leaves Benefits: జామ ఆకులతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..!
జామ ఆకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే సహజ ఔషధంగా పనిచేస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మధుమేహ నియంత్రణ, గుండె ఆరోగ్యం, చర్మ సంరక్షణ, నోటి పరిశుభ్రత కోసం కూడా చాలా మేలు చేస్తాయి. నిత్యం జామ ఆకులను నమలడం లేదా టీగా తాగడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

వారానికి మూడు సార్లు జామ ఆకులను నమలడం వలన జీర్ణక్రియను మెరుగుపర్చడం, రోగనిరోధక శక్తిని పెంచడం, చర్మ ఆరోగ్యం, గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. జామ ఆకుల్లో ఉన్న సహజ సమ్మేళనాలు మన శరీరానికి ఆరోగ్యం, కాంతిని అందిస్తాయి.
రోగనిరోధక శక్తి
జామ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటి ద్వారా మన శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సత్వర సహాయం పొందుతుంది. పచ్చిగా లేదా వేడి నీటిలో నానబెట్టిన జామ ఆకులను తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.
జీర్ణక్రియ
జామ ఆకులు గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచటానికి ఉపయోగపడతాయి. అజీర్ణం, ఉబ్బరం తగ్గించటానికి ఈ ఆకులు సహాయపడతాయి. భోజనం ముందు 2-3 తాజా ఆకులను నమలడం ద్వారా మెరుగైన జీర్ణక్రియ కలుగుతుంది.
మధుమేహం
జామ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. దీని వల్ల మధుమేహం ఉన్నవారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. జామ ఆకుల టీ తాగడం లేదా భోజనం తర్వాత పచ్చి జామ ఆకులను నమలడం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దోహదం చేస్తుంది.
గుండె ఆరోగ్యం
జామ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడతాయి. 2-3 ఆకులను క్రమం తప్పకుండా నమలడం లేదా జామ ఆకు టీ తాగడం గుండె ఆరోగ్యానికి మంచిదిగా ఉంటుంది.
నోటి ఇన్ఫెక్షన్లు
జామ ఆకుల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండడం వల్ల ఇవి చిగుళ్ల వ్యాధి, దుర్వాసన, కావిటీస్ ను తగ్గిస్తాయి. నోటి పరిశుభ్రత కోసం తాజా ఆకులను నమలడం లేదా పుక్కిలించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
చర్మ ఆరోగ్యం
జామ ఆకులు మొటిమలు, చర్మంపై మచ్చలను తగ్గించటంలో సహాయపడుతాయి. ఆకులను పేస్ట్ లాగా చేసి నేరుగా ముఖానికి పూయడం లేదా తాజా ఆకులను నమలడం ద్వారా చర్మ ఆరోగ్యానికి ప్రయోజనం కలుగుతుంది.
ఋతు తిమ్మిరి
జామ ఆకుల యాంటీ స్పాస్మోడిక్ ప్రభావాలు ఋతు సమయంలో కలిగే నొప్పులను తగ్గించటంలో సహాయపడతాయి. టీగా తయారు చేసి గోరువెచ్చగా త్రాగడం వల్ల ఋతు తిమ్మిరి నుండి ఉపశమనం పొందవచ్చు.
దగ్గు, జలుబు
జామ ఆకులు సహజమైన కఫ్ నిరోధకంగా పనిచేస్తాయి. ఇవి శ్లేష్మాన్ని తగ్గించటంలో, గొంతు చికాకును తొలగించటంలో సహాయపడతాయి. తేనెతో కలిపి జామ ఆకు టీ తాగడం వల్ల దగ్గు, జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు.