
Benefits Of Walnut Oil: వాల్నట్ లను మన తెలుగులో అక్రోటు కాయలని అంటాం. ఈ వాల్‌నట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ వాల్‌నట్స్‌లో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, భాస్వరం, రాగి, సెలీనియం, ఒమేగా 3 వంటివి ఉన్నాయి. అయితే వాల్నట్స్ లో ఉన్నట్లుగానే వాల్నట్ నూనెలో కూడా మంచి పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. అనేకాదు ఈ నూనెలో ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం అని పిలువబడే ఒమేగా -3 కొవ్వు ఆమ్లం ఉంది. అందుకని ఈ ఆయిల్ ను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే.. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 10% తగ్గిస్తుంది. అంతేకాదు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడుతుంది. ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అందాన్ని కూడా ఇస్తుంది వాల్నట్ నూనె. అయితే వాల్నట్ నూనెని వంట చేసే సమయంలో వాడకూడదు. ఎందుకంటే కూరకి చేదు రుచి వస్తుంది కనుక దీనిని నేరుగా వంటల్లో కాకుండా సలాడ్లలో ఆహారంలో తీసుకోవచ్చు. ఆరోగ్యం కోసం వాల్నట్ నూనెను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..
* వాల్నట్ నూనె లో ఉన్న పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లాలు రక్తంలో షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తాయి. దీనివలన గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
*ఈ నూనెలో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు బరువును నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ నూనెలో సుమారు 10.4 శాతం ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి అందుకని శరీరంలోని కొవ్వు ని తగ్గించటానికి సహాయపడతాయి.
*మృదువైన చర్మం కోసం వాల్నట్ నూనె మంచి సహాయకారి. కొంచెం వాల్నట్ నూనెను తీసుకుని ముఖంపై వేళ్ల సహాయంతో మసాజ్ చేయండి.
*వాల్నట్ ఆయిల్ చర్మం పై ఏర్పడే ముడతలను తగ్గిస్తుంది. కాలుష్య కారకాలు , ఫ్రీ రాడికల్స్ కారణంగా, చర్మం వయస్సు ముందే ముడతలు పడటం ప్రారంభిస్తే.. ఈ ఆయిల్ మంచి ప్రయోజనకారి. చర్మం తేమను నింపుకునే సామర్ధ్యాన్ని కలిగి ఉంది.
పెరుగులో కానీ తేనే లో కానీ నాలుగు ఐదు చుక్కల వాల్నట్ నూనెలో వేసి మొహానికి రాసుకుని ఒక అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మొహం కాంతివంత మవుతుంది.
*వాల్నట్ ఆయిల్ అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనాన్ని సీటుంది. దీనిలో ఆరు రకాల బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగపడే యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉందని కొన్ని పరిశోధనల్లో తెలిసింది. ఇన్ఫెక్షన్ల వ్యాప్తి చేసే బ్యాక్టీరియాను చర్మం మీదనుంచి తొలగించి చర్మం ఆరోగ్యంగా ఉండే విధంగా చేస్తుంది.
*కాలుష్యం , వయస్సు.. పోషకహారం లోపం ఇలా అనేక కారణాలతో జుట్టు రాలడం సర్వసాధారణంగా మారిపోయింది. వాల్నట్ ఆయిల్ ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని , ఒత్తిడిని తగ్గించడంలో సహాయం పడి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. వాల్‌నట్‌లో ఉండే పోషకాలు జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.
*శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, రక్త ప్రసరణ సక్రమంగా ఉండటం చాలా అవసరం. అందుకని ఆరోగ్యకరమైన రక్తనాళాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, వాల్నట్ నూనె వాడకం ప్రయోజనకరంగా ఉంటుంది.
వాల్‌నట్స్‌లో లినోలెయిక్ ఆమ్లం ఉంటుంది, వాల్నట్ నూనె తీసుకోవడం వలన రక్తపోటును నియంత్రించడంలో పాటు
రక్తనాళాల పనితీరు మెరుగుపరుస్తుంది.
*అయితే వాల్ నట్స్ తింటే ఎలర్జీ వచ్చే వారు మాత్రం ఈ నేనుకు దూరంగా ఉండడం మంచిది.
Also Read: ప్రపంచంలోనే డేంజర్ గార్డెన్.. ప్రాణాలు హరించే విషం వెదజల్లే మొక్కలు ఎక్కడున్నాయో తెలుసా