Aloe Vera Juice Benefits: అలోవెరా మొక్క ఔషధ గుణాలకు ప్రసిద్ధి. కలబందలో ఉండే శీతలీకరణ గుణాలు చర్మ సంబంధిత సమస్యలు, మలబద్ధకం, కీళ్ల నొప్పులు వంటి అనేక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతుంది. మొత్తంగా కలబంద మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ప్రజలు దాని అద్భుతమైన లక్షణాల గురించి మరింత తెలుసుకుంటున్నారు. అందుకే.. దానిని ఏదో ఒక విధంగా దినచర్యలో భాగంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా కలబంద జ్యూస్‌కు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఎందుకంటే.. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, కలబంద జ్యూస్‌ని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
అలోవెరా జ్యూస్ ఎలా తయారు చేయాలి?
కలబంద మొక్క, నీరు, తేనె, నిమ్మరసం అవసరం. మొక్క నుండి కలబంద ఆకును కత్తిరించాలి. అరటిపండ్ల తొక్క తొలగించినట్లుగా.. కలబంద పై పొరను తొలగించండి. ఒక చెంచా తీసుకుని తాజా అలోవెరా జెల్‌ని బయటకు తీయాలి. అలోవెరా జెల్‌ని ఒక గిన్నెలోకి తీసుకుని ఒకసారి నీటితో శుభ్రం చేసుకోవాలి. అలా చేయడం ద్వారా కలబంద చేదు పోతుంది. గ్రైండర్‌లో అలోవెరా జెల్, కొంత నీరు వేయాలి. రసం చేయడానికి బ్లెండ్ చేయాలి. దీన్ని ఒక గ్లాసులో తీసుకుని రుచికి అనుగుణంగా తేనె కలుపుకోవాలి. నిమ్మరసం పిండడం వల్ల కలబంద రసం రుచి పెరుగుతుంది. అలోవెరా జ్యూస్‌ని అలాగే తీసుకోవచ్చు.
కలబంద రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
1. కలబంద రసంలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మానికి చాలా మేలు చేస్తుంది. కలబంద రసం హైడ్రేటింగ్‌గా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని లోపలి నుండి మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్‌గా తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి.
అలోవెరా జ్యూస్ వ్యాధితో పోరాడే శక్తిని పెంచుతుంది. అలర్జీలను దూరం చేస్తుంది. కలబంద రసాన్ని రోజూ తాగడం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు కీళ్ల నొప్పుల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. కలబంద రసం ప్రేగులలో నీటి శాతాన్ని పెంచడంలో సహాయపడుతుంది. తద్వారా మలబద్ధకాన్ని నివారిస్తుంది.
3. కలబంద మొక్కలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కాల్షియం, పొటాషియం, జింక్, సోడియం వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అలోవెరా జ్యూస్ తాగడం వల్ల ఈ పోషకాలన్నీ మీ శరీరానికి అందుతాయి.
4. కలబంద రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి మన శరీరానికి చాలా అవసరం. ఇది మన రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
5. కలబంద పూర్తిగా సహజమైనది. ఇది మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే ఇది అందరికీ పని చేయకపోవచ్చు. మీరు దీనిని తినే ముందు ఒకసారి నిపుణులను సంప్రదించడం ఉత్తమం. కలబంద రసాన్ని తాగిన తరువాత ఏవైనా ఆరోగ్య సమస్యల తలెత్తితే.. వెంటనే ఆపేసి వైద్యుడిని సంప్రదించాలి.
Also read:
Vijayashanthi: చెల్లాచెదురైన జీవితాలు త్వరితగతిన గాడిన పడాలి.. భారీ వర్షాలపై విజయశాంతి ట్వీట్