Aloe Vera: ఆ సమస్యతో బాధపడితే కలబంద వాడండి.. తక్షణమే ఉపశమనం..

|

Mar 07, 2022 | 9:50 AM

Aloe Vera: అలోవెరా ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా అనేక సంవత్సరాలుగా ప్రజాదరణ పొందింది. అలోవెరాలో ఉండే శీతలీకరణ గుణాలు చర్మ సంబంధిత సమస్యలు, మలబద్ధకం,

Aloe Vera: ఆ సమస్యతో బాధపడితే కలబంద వాడండి.. తక్షణమే ఉపశమనం..
Aloe Vera
Follow us on

Aloe Vera: అలోవెరా ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా అనేక సంవత్సరాలుగా ప్రజాదరణ పొందింది. అలోవెరాలో ఉండే శీతలీకరణ గుణాలు చర్మ సంబంధిత సమస్యలు, మలబద్ధకం, కీళ్ల నొప్పులు వంటి కొన్ని సాధారణ సమస్యల నుంచి దూరం చేస్తాయి. కలబంద రసంలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. కలబంద రసం హైడ్రేటింగ్‌గా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని లోపలి నుంచి మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. అలోవెరా జ్యూస్ వ్యాధితో పోరాడే శరీర శక్తిని పెంచి అలర్జీలను దూరం చేస్తుంది. అయితే దురద సమస్యలకు కలబంద చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. మీరు శరీరం పట్ల శుభ్రత వహించకుంటే దురద సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ శరీరంలో ఎరుపు రంగు దద్దుర్లని కూడా కలిగిస్తుంది. ఈ సమస్యలను అధిగమించడానికి కలబందను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

మార్కెట్‌లో లభించే కలబందకు బదులుగా మీరు ఇంట్లో దొరికే అలోవెరా నుంచి గుజ్జును తీసి ఉపయోగించవచ్చు. ఎందుకంటే మార్కెట్‌లో లభించే కలబందలో అనేక రసాయనాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. బేకింగ్ సోడా లేదా నిమ్మరసం కలిపి అప్లై చేస్తే దురద నుంచి ఉపశమనం లభిస్తుంది. కలబంద జెల్‌లో తులసిని మిక్స్ చేసి దురద ఉన్న ప్రదేశంలో 20 నిమిషాలు పట్టించి శుభ్రమైన నీటితో కడగాలి. ఇది మీ దురదను తొలగిస్తుంది. కలబంద, వేప రెండూ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. వేప ఆకులను గ్రైండ్ చేసి అందులో అలోవెరా జెల్ మిక్స్ చేసి దురద ఉన్న చోట రాయాలి. ఈ రెమెడీతో దురద సమస్య దూరమవుతుంది.

దురద సమస్యను కలబంద, ఓట్ మీల్ పేస్ట్‌తో కూడా అధిగమించవచ్చు. దీని కోసం ఒక కప్పు గోరువెచ్చని నీటిని తీసుకోండి. దానికి గ్రైండ్ చేసిన ఓట్ మీల్ వేసి పేస్ట్ లా చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్‌లో తాజా అలోవెరా జెల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని దురద ఉన్న ప్రదేశంలో 30 నుంచి 40 నిమిషాల పాటు అప్లై చేసి శుభ్రమైన నీటితో కడగాలి. అలాగే రెండు చెంచాల కలబంద జెల్‌లో గంధపు పేస్ట్‌ని కలిపి దురద ఉన్న ప్రదేశంలో రాయండి. ఇది మీ సమస్యకు పరిష్కారం చూపుతుంది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Maruti Suzuki: మారుతి సుజుకి బంపర్ ఆఫర్.. వ్యాగనర్ నుంచి ఆల్టో వరకు రూ.40,000 తగ్గింపు..

7th Pay Commission: గుడ్‌న్యూస్‌.. వచ్చే నెల నుంచి వారి జీతాలు హైక్‌..!

ఈ పథకంలో నెలకి రూ.3000 పొదుపు చేస్తే చాలు.. 15 లక్షల నిధి మీ సొంతం..!