Skin Care Tips: చలికాలంలో చర్మం డల్‌గా, డ్రైగా ఉందని చింతిస్తున్నారా..? ఇది మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది..!

|

Jan 07, 2023 | 8:22 AM

రసాయన మాయిశ్చరైజర్లు తాత్కాలికంగా మాత్రమే పరిష్కారం చూపిస్తాయి. అవి చర్మం బయటి పొరను తాత్కాలికంగా తేమ అందిస్తాయి. ఆర్గాన్ ఆయిల్ విటమిన్ E, సహజ కొవ్వు ఆమ్లాలను ఆరోగ్యవంతమైన చర్మానికి ఉపయోగపడతాయి.

Skin Care Tips: చలికాలంలో చర్మం డల్‌గా, డ్రైగా ఉందని చింతిస్తున్నారా..? ఇది మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది..!
Skin Care
Follow us on

చలికాలంలో చర్మం తేమను కోల్పోతుంది. దాంతో చర్మం డల్ గా, డ్రైగా మారుతుంది. చల్లటి గాలుల కారణంగా చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. చలికాలంలో చర్మ సంరక్షణ, సౌందర్యం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఫేస్‌ ప్యాక్‌లు, మాస్క్‌లు వాడుతుంటారు. ఖరీదైన క్రీములు కూడా వాడుతుంటారు. అయితే, వీటన్నింటికి చెక్‌ పెడుతూ తక్కువ ఖర్చులో మనకు అందుబాటులో దొరికే పదార్థం మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. ముఖ్యంగా చలికాలంలో మీ అందాన్ని మరింత పెంచేందుకు కలబంద చక్కటి పరిష్కారం అంటున్నారు ఆరోగ్య నిపుణులు..చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా ఉంచుకోవడానికి అలోవెరాను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

చర్మ సమస్యలను తగ్గించడానికి, చర్మానికి మంచి నిగారింపును అందిస్తుంది. రాత్రి పడుకునే ముందు ముఖానికి అలోవెరా జెల్ ను అప్లై చేసుకుని ఉదయాన్నే ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు ప్రయత్నిస్తే చర్మం నలుపుదనం తగ్గి చర్మానికి మంచినిగారింపు వస్తుంది. ఒక కప్పులో అలోవెరా జెల్, విటమిన్ ఇ క్యాప్సిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంగు మచ్చలపై అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకుంటే మంగు మచ్చలు తగ్గడంతో పాటు మొటిమలు, నల్లటి వలయాలు వంటి చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. రసాయన మాయిశ్చరైజర్లు తాత్కాలికంగా మాత్రమే పరిష్కారం చూపిస్తాయి. అవి చర్మం బయటి పొరను తాత్కాలికంగా తేమ అందిస్తాయి.

కలబంద మన చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చర్మంపై ఉన్న డెడ్‌ సెల్స్‌ని తొలగిస్తుంది. గ్లోను పెంచుతుంది. చర్మం తేమగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జులో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ రంగు మారకుండా చూస్తుంది. ఇందుకోసం కలబంద గుజ్జును తీసుకుని ముఖానికి మెడకు అప్లై చేయాలి. అలోవెరా లిక్విడ్ సోప్ మార్కెట్లో అందుబాటులో ఉంటోంది. ఇది చర్మం తేమను కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనిని ఇంట్లో అందరూ ఉపయోగించవచ్చు. ఇది చక్కని క్లెన్సర్ లా ఉపయోగపడుతుంది. ఆర్గాన్ ఆయిల్ విటమిన్ E, సహజ కొవ్వు ఆమ్లాలను ఆరోగ్యవంతమైన చర్మానికి ఉపయోగపడతాయి. కలబంద చర్మాన్ని శాంతపరుస్తుంది. మృదువుగా మారుస్తుంది. అలో బాడీ వాష్ అనేది తేలికపాటి, ప్రభావవంతమైన క్లెన్సర్, ఇది చర్మాన్ని కూడా కండిషన్ చేస్తుంది. అలో బాడీ వాష్ మీ చర్మాన్ని ఉత్తమమైన ప్రకృతితో పోషించి శుభ్రపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.