మందు బాబులకు అలర్ట్.. ఆల్కహాల్ కిడ్నీలను ఎలా గుల్ల చేస్తుందో తెలుసా..? గుండె గుభేలే..

|

Nov 05, 2024 | 8:21 PM

మద్యం తాగడం మూత్రపిండాలకు తీవ్ర హాని కలిగిస్తుంది. రక్త ప్రసరణ పెరిగి కిడ్నీలపై అదనపు ఒత్తిడి పడుతుంది.. వాపు, నొప్పి, చివరకు కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుంది. డయాల్సిస్‌కు దారితీసే విధంగా దీర్ఘకాలికంగా కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, సరిపోయే నీరు త్రాగడం, మద్యం నివారణతో మూత్రపిండాలను కాపాడుకోవచ్చు.

మందు బాబులకు అలర్ట్.. ఆల్కహాల్ కిడ్నీలను ఎలా గుల్ల చేస్తుందో తెలుసా..? గుండె గుభేలే..
Alcohol Kidney Damage
Follow us on

మద్యపానం ఆరోగ్యానికి మంచిది కాదు.. ఈ అలవాటు అన్ని రకాలుగా గుల్ల చేస్తుంది. మద్యం తాగేవారిని.. అతని మొత్తం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. ఆల్కాహాల్ మన శరీరానికి అత్యంత హాని కలిగిస్తుందంటే.. గుండె, కాలేయం, మెదడుతో సహా అనేక అవయవాలు దీని బారిన పడతాయి.. అంతేకాకుండా మద్యం వల్ల మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటాయి. మూత్రపిండాలు మనకు చాలా ముఖ్యమైన అవయవం.. దాని పని శరీరం నుండి విష పదార్థాలను ఫిల్టర్ చేయడం.. తద్వారా వ్యాధులు సంభవించవు.

ఆల్కహాల్ తీసుకోవడం శరీరంలోని అన్ని భాగాలకు హానికరం.. అయినప్పటికీ, ఇది కిడ్నీలను కూడా చెడుగా ప్రభావితం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్ వల్ల కిడ్నీలు సక్రమంగా పని చేయలేక, ఆ తర్వాత కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అతిగా తాగడం వల్ల మన కిడ్నీలు ఎలా పాడవుతాయో ఇప్పుడు తెలుసుకోండి..

మద్యం వల్ల కిడ్నీ ఎలా దెబ్బతింటుందో తెలుసా..

కిడ్నీ పనితీరుపై ప్రభావం: ఆల్కహాల్ తాగడం వల్ల కిడ్నీలో రక్తప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల కిడ్నీలపై అదనపు ఒత్తిడి పడుతుంది.. అటువంటి పరిస్థితిలో, మూత్రపిండాల పనితీరు తగ్గుతుంది. ఒక్కసారి మీ కిడ్నీలు చెడిపోతే, మీరు అనేక వ్యాధుల బారిన పడవచ్చు.

కిడ్నీలో వాపు: మద్యపాన అలవాట్లను నియంత్రించుకోని వారి కిడ్నీలో వాపు పెరుగుతుంది. దీని తరువాత, మూత్రపిండాలలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఇది కొన్నిసార్లు భరించలేనిదిగా మారుతుంది.

కిడ్నీలు చెడిపోయే ప్రమాదం: ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత కూడా మీరు మద్యం సేవించడం మానేయకపోతే, దీర్ఘకాలికంగా కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది. కిడ్నీలు చెడిపోయిన వారు జీవితాంతం డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది.

మూత్రపిండాలను ఎలా కాపాడుకోవాలంటే..

కిడ్నీలు మనకు చాలా విలువైనవి.. అవి లేకుండా జీవితం కష్టం అవుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ అవయవాన్ని కాపాడుకోవడం మన స్వంత బాధ్యత. అన్నింటిలో మొదటిది మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి.

కిడ్నీల పనితీరులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోజంతా 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి.

ఇది కాకుండా, మీరు నిమ్మ నీరు – కొబ్బరి నీరు వంటి ఆరోగ్యకరమైన పానీయాల ద్వారా మూత్రపిండాలను శుభ్రం చేయవచ్చు.

అంతేకాకుండా.. మంచి జీవనశైలిని అవలంభించడం, ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం లాంటివి చేయాలి..

ఏమైనా కిడ్నీలకు సంబంధించిన సమస్యలుంటే.. వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి