AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akkineni Nagarjuna: 66 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల యువకుడిలా.. కింగ్ నాగార్జున ఫిట్‌నెస్ సీక్రెట్​ ఇదే!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన్మథుడు, కింగ్​గా పేరుగాంచిన అక్కినేని నాగార్జున 66 ఏళ్ల వయసులోనూ యంగ్ టోన్డ్ బాడీ, గ్లోయింగ్ స్కిన్‌తో యూత్‌కు రోల్ మోడల్​గా నిలుస్తున్నారు. ఈ ఏడాది విడుదలైన ‘కుభేర’, ‘కూలీ’ సినిమాల్లో నాగార్జున గ్రేస్​, స్టైల్​ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Akkineni Nagarjuna: 66 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల యువకుడిలా.. కింగ్ నాగార్జున ఫిట్‌నెస్ సీక్రెట్​ ఇదే!
King Nagarjuna
Nikhil
|

Updated on: Nov 22, 2025 | 10:54 AM

Share

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన్మథుడు, కింగ్​గా పేరుగాంచిన అక్కినేని నాగార్జున 66 ఏళ్ల వయసులోనూ యంగ్ టోన్డ్ బాడీ, గ్లోయింగ్ స్కిన్‌తో యూత్‌కు రోల్ మోడల్​గా నిలుస్తున్నారు. ఈ ఏడాది విడుదలైన ‘కుభేర’, ‘కూలీ’ సినిమాల్లో నాగార్జున గ్రేస్​, స్టైల్​ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నాగార్జున ఇటీవల షేర్ చేసిన ఫిట్‌నెస్ సీక్రెట్స్ ప్రకారం, డైలీ వర్కౌట్స్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, క్వాలిటీ స్లీప్ తన డైలీ రొటీన్​. అవే తన ఫిజికల్​, మెంటల్​ హెల్త్​కి ముఖ్య కారణమంటున్నారు కింగ్​.

డైలీ వర్కౌట్ రొటీన్

నాగార్జున్ ఫిట్‌నెస్‌ను లైఫ్‌స్టైల్‌గా చేసుకున్నారు. వారానికి 5-6 రోజులు, కనీసం 45 నిమిషాల నుంచి 1 గంట వర్కౌట్ చేస్తారు. హార్ట్ రేట్ 70% పైనే ఉంచుకుని కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మిక్స్ చేస్తారు. మార్నింగ్ 5:30కి లేచి, జాగింగ్ లేదా సైక్లింగ్‌తో తన రోజుని స్టార్ట్ చేస్తారు. వారంలో 3 రోజులు వెయిట్ లిఫ్టింగ్ (బెంచ్ ప్రెస్, స్క్వాట్స్), 2 రోజులు యోగా/పిలేటెస్ చేస్తారు. ‘వయసు పెరిగినా మసిల్స్ లూజ్ కాకుండా ఉంచాలంటే రెగ్యులర్‌గా చేయాలి’ అంటున్నారు నాగ్​. ఇటీవల అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ స్టడీ ప్రకారం, 60+ వయసులో వీక్లీ 150 నిమిషాల ఎక్సర్‌సైజ్ మసిల్ మాస్ 15% పెంచుతుంది. నాగార్జున్ కూడా ఇదే ఫాలో అవుతున్నారు.

డైట్ ప్లాన్

నాగార్జున బాడీ మెయింటనెన్స్​లో కీ రోల్​ డైట్​. 12:12 ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్.. 12 గంటలు తినడం, 12 గంటలు ఫాస్టింగ్. ఉదయం 8 గంటలకు బ్రేక్‌ఫాస్ట్, రాత్రి 8 గంటలకు డిన్నర్. లేచిన తర్వాత వామ్ వాటర్‌తో మొదలుపెట్టి, ఆ తర్వాత మెటబాలిజం బూస్ట్ చేయడానికి బ్లాక్ కాఫీ, బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్, ఫ్రూట్స్, గ్రీక్ యోగర్ట్, లంచ్‌లో గ్రిల్డ్ చికెన్/ఫిష్, క్వినోవా సలాడ్, వెజ్ స్టిర్-ఫ్రై, స్నాక్స్‌కు అల్మండ్స్, గ్రీన్ టీ, డిన్నర్ 6 PM ముందు ముగించాలి.

ఇది బ్లడ్ షుగర్ స్పైక్‌ను అరికట్టుతుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ స్టడీ చెబుతోంది. గట్ హెల్త్ కోసం కిమ్చి, సౌర్‌క్రాట్ లాంటి నేచురల్ ప్రోబయోటిక్స్ తింటారు నాగ్​. రోజుకు 3-4 లీటర్లు వాటర్, లెమన్ ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ ఎక్కువగా తీసుకుంటారు. ‘హైడ్రేషన్ స్కిన్ గ్లో కోసం మ్యాజిక్’ అంటున్నారు నాగార్జున.

స్కిన్​కేర్​

యంగ్ స్కిన్ కోసం క్వాలిటీ స్లీప్ చాలా ముఖ్యం. రాత్రి 10 గంటలలోపు పడుకుని కచ్చితంగా రోజూ 7-8 గంటలు నిద్రపోవాలి. నిద్రిస్తున్నప్పుడు మసిల్ రికవరీ, కొల్లజన్ ప్రొడక్షన్ పెరుగుతాయి. ఒత్తిడి తగ్గించుకోవడానికి మెడిటేషన్, ప్రాణాయామం చేస్తారు. సన్‌స్క్రీన్ (SPF 50), మాయిశ్చరైజర్, వీక్లీ ఫేషియల్స్, విటమిన్ C సీరం, రెటినాల్ క్రీమ్ యూజ్ చేస్తారు. ఇవి యాంటీ-ఏజింగ్‌కు హెల్ప్ చేస్తాయి.

డాక్టర్​ సలహాతో సప్లిమెంట్స్‌గా మల్టీవిటమిన్, ఓమెగా-3, కొల్లజన్ పొడర్ తీసుకుంటారు. నాగార్జున ఫిట్‌నెస్ జర్నీ 80ల నుంచే స్టార్ట్ అయింది. ‘వయసు నంబర్, ఫిట్‌నెస్ మైండ్‌సెట్’ అంటారు నాగ్​. మనం కూడా నాగార్జున డైలీ రొటీన్ ఫాలో అయితే 50+ వయసులో కూడా యంగ్‌గా ఉండవచ్చు. మీరు కూడా ట్రై చేయండి – రిజల్ట్స్ గ్యారంటీ!

Follow Us