High BP : హై బీపీని కంట్రోల్‌ చేసే అద్భుతం.. అనేక ఆరోగ్య సమస్యలను చిటికెలో పోగొట్టే మాయా మూలిక..!

|

Jul 09, 2022 | 7:55 AM

హై బీపీతో బాధపడేవారి సమస్య చాలా కాలం పాటు గుర్తించకపోవడంతో గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆరోగ్య సంరక్షణ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.

High BP : హై బీపీని కంట్రోల్‌ చేసే అద్భుతం.. అనేక ఆరోగ్య సమస్యలను చిటికెలో పోగొట్టే మాయా మూలిక..!
Ashwagandha
Follow us on

High BP : వయసు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు రావడం సహజమే.. కానీ, చిన్న వయసులోనే అది మిమ్మల్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తే.. అది టెన్షన్‌కు కారణం కావచ్చు. నేటి యువత 40, 30 ఏళ్ల వయస్సులోనే అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. దీని వెనుక బిజీ షెడ్యూల్, చెడిపోయిన జీవనశైలి, (జీవనశైలి) ఒత్తిడి, నిరాశ, ఇతర కారణాలు ఉండవచ్చు. ఈ రన్-ఆఫ్-ది-మిల్ జీవితంలో మనమందరం స్వీయ-సంరక్షణ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. 40 సంవత్సరాల వయస్సు దాటిన వారిలో ఆరోగ్య సమస్యలు తలెత్తటం సహజం..ఇందులో అధిక BP అనేది సాధారణ విషయం. హై బీపీతో బాధపడేవారి సమస్య చాలా కాలం పాటు గుర్తించకపోవడంతో గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆరోగ్య సంరక్షణ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. అధిక బిపిని నియంత్రించడానికి ఆయుర్వేదంలో అనేక మార్గాలు సూచించారు. వాటిలో మూలికల వినియోగం కూడా ఒకటి. అశ్వగంధ, తులసి వంటి మూలికలతో 40 ఏళ్ల తర్వాత బీపీని ఎలా అదుపులో ఉంచుకోవచ్చో తెలుసుకోండి.

అశ్వగంధ మూలికా పేరు చాలామంది వినే ఉంటారు. కానీ దాని ఉపయోగాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దీన్ని నిజంగా మాయ మూలిక అని కూడా అనొచ్చు..ఎందుకంటే.. నిజంగానే అశ్వగంధ అనేక సమస్యలను చిటిక లో పోగొడుతుంది.. అందుకే దీనిని మాయ మూలిక అన్న తప్పులేదు. అశ్వగంధ శరీరాన్ని పునర్జీవింప చేయడం లో సహాయ పడుతుంది మరియు శారీరక మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగు పరుస్తుందని చెప్పొచ్చు.

ఆయుర్వేదంలో అశ్వగంధకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్, డిప్రెషన్‌ను ఎదుర్కొంటున్న వారు ఈ హెర్బ్ సహాయంతో మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. మీరు మానసికంగా దృఢంగా ఉంటే, మీ బీపీ కూడా అదుపులో ఉంటుంది. అశ్వగంధను సక్రమంగా సేవిస్తే ఎలాంటి హాని ఉండదు. మీరు దీన్ని సులభంగా ఆహారంలో చేర్చవచ్చు. ఇందుకోసం అశ్వగంధ పొడిని తీసుకుని వేడి నీళ్లలో కలపాలి. ఈ అశ్వగంధ నీటిని ఉదయాన్నే సేవించండి. ఇలా కొన్ని రోజులు క్రమం తప్పకుండా చేస్తే తేడాను గమనించగలరు. మధుమేహం రోగుల్లో ఇన్సులిన్ స్థాయిలని పెంచేందుకు కూడా అశ్వగంధ బాగా పని చేస్తుంది

ఆరోగ్యం, మతపరమైన దృక్కోణం నుండి భారతదేశంలో తులసి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. పురాతన కాలం నుండి, ప్రజలు ఈ పవిత్రమైన మొక్కను పూజిస్తూ, ఆరోగ్యంగా ఉండటానికి వినియోగిస్తున్నారు. ఔషద గుణాలతో నిండిన తులసి అధిక బీపీ ఉన్నవారికి దివ్యౌషధం కంటే తక్కువ కాదు. దీని ఆకులలో యూజినాల్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది సహజ కాల్షియం ఛానల్ బ్లాకర్‌గా పని చేస్తుంది. అధిక BP ని నియంత్రిస్తుంది. రోజూ ఖాళీ కడుపుతో తులసి ఆకులను నమలండి లేదా దానితో చేసిన టీని తాగాలి.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్  చేయండి

 

(గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించడం చాలా మంచిది.)