Omega-3 Rich Foods: గుండెను ఆరోగ్యంగా ఉంచే ఒమెగా 3 కావాలంటే.. తినాల్సిన ఆహారాలివే.. ఇంకెన్నో ప్రయోజనాలు కూడా..

|

Feb 03, 2023 | 6:35 AM

Omega 3: మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పోషకాలతో నిండిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. ఈ క్రమంలోనే నిత్యం పండ్లు, కూరగాయలు..

Omega-3 Rich Foods: గుండెను ఆరోగ్యంగా ఉంచే ఒమెగా 3 కావాలంటే.. తినాల్సిన ఆహారాలివే.. ఇంకెన్నో ప్రయోజనాలు కూడా..
Omega 3 Rich Foods
Follow us on

Omega 3: మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పోషకాలతో నిండిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. ఈ క్రమంలోనే నిత్యం పండ్లు, కూరగాయలు, సముద్రపు ఆహార పదార్థాలు సహా ఇతర ఆరోగ్యకరమైన పోషకాలను మనం తీసుకునే ఫుడ్‌లో చేర్చడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఒమేగా-3 ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. మెదడు, గుండె, పునరుత్పత్తి వ్యవస్థతో సహా శరీరంలోని ముఖ్యమైన భాగాలకు అద్భుతమైన పోషకం ఒమేగా-3. ఈ పోషకాలను క్రమం తప్పకుండా తీసుకుంటే.. జీవితకాలం పెరిగే ఛాన్స్ ఉంది. ఇంకా దీని వల్ల శరీరానికి చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒమేగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదం నుంచి కాపాడుతుంది. ఇది మన శరీరానికి శక్తిని మంచి కేలరీలను అందిస్తుంది. ఒమేగా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

అయితే ఈ ఒమెగా-3 మాంసహారంలోనే పుష్కలంగా ఉంటుందని కొందరు అపోహ పడుతుంటారు. కానీ, శాఖాహారంలోనూ ఒమెగా-3 పెద్ద మొత్తంలో ఉంటుంది. మరి ఒమెగా-3 ఉండే శాఖాహార పదార్థాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి
  1. అవిసె గింజలు: అవిసె గింజలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఇందులో విటమిన్ ఈ, మెగ్నీషియం వంటి అనేక ఇతర పోషకాలు ఉంటాయి.
  2. వాల్‌నట్‌లు: వాల్‌నట్‌లు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లకు మంచి మూలమని చెప్పవచ్చు. మీరు డైట్‌లో కచ్చితంగా వాల్‌నట్‌లను చేర్చుకోవాలి. ఇందులో కాపర్, విటమిన్ ఈ, మెగ్నీషియం వంటి అనేక ఇతర పోషకాలు ఉంటాయి.
  3. ఎడమామ్: ఇది ఒక సోయాబీన్ ఉత్పత్తి. ఎడమామ్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఒమేగా-3 రిచ్ ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉంటాయి. దీన్ని ఆహారంలో తినడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
  4. కిడ్నీ బీన్స్: రజ్మా, కిడ్నీ బీన్స్ పేరుతో పిలువబడే ఈ గింజలలో ఒమేగా-3 అధికంగా ఉంటుంది. అరకప్పు కిడ్నీ బీన్స్‌లో 0.10 గ్రాముల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి.
  5. సోయాబీన్స్: సోయాబీన్స్‌లో ఒమేగా-3, ఒమేగా-6 రెండూ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, విటమిన్లు అధికంగా ఉంటాయి.
  6. గుడ్లు: ఒమేగా-3 యాసిడ్స్ కోసం మీరు తప్పనిసరిగా ఆహారంలో గుడ్లను చేర్చుకోవాలి. గుడ్లలో ప్రొటీన్లు, విటమిన్లు, ఒమేగా 3 యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి.
  7. గ్రీన్ వెజిటేబుల్స్: గ్రీన్‌ వెజిటేబుల్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు అధింకగా ఉంటాయి. మీరు ఆహారంలో పాలకూర, ఆకుకూరలు చేర్చవచ్చు. ఈ కూరగాయలలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కాకుండా, కాలీఫ్లవర్‌లో ఒమేగా-3 యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి.
  8. సముద్రపు పాచి: సముద్రపు పాచి.. శాకాహారులకు ఉత్తమ మైన ఫుడ్. సముద్రపు పాచి, నోరి, స్పిరులినా వంటి వాటిల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి