Figs for Health: మేడిపండ్లతో లేక్కలేనన్ని ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.. ఆ వివరాలు మీ కోసం..

|

Feb 11, 2023 | 2:09 PM

రోజు రాత్రి 3, 4 అంజీరాలను నీటిలో వేసుకొని.. ఉదయం పరగడుపునే తింటే తక్షణ శక్తి లభిస్తుందని పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు. మరి ఈ అంజీరాలతో..

Figs for Health: మేడిపండ్లతో లేక్కలేనన్ని ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.. ఆ వివరాలు మీ కోసం..
Health Benefits Of Anjeer Fruit
Follow us on

నిత్యం అనుభవించే ఆరోగ్య సమస్యలకు పోషకాలు లేని ఆహారం, సమయ పాలనలేని ఆహారపు అలవాట్లు, జీవన విధానమే ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలనైనా సరైన ఆహారపు అలవాట్లతో నివారించవచ్చిన సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రకాల ఆహార పదార్థాలను తింటే శరీరానికి కావలసిన పోషకాలు, తద్వారా ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరతాయని వివరిస్తున్నారు. పోషకాలతో కూడిన ఆహారాలుగా వారు పేర్కొన్న ఆహారపదార్థాలలో డ్రైఫ్రూట్స్, అంజీర్ పండ్లు ప్రధానమైనవి. అయితే అంజీర్ పండును మీరు ఇప్పటికే చూసి ఉంటారు. దీన్నే మేడి పండు అని, ఫిగ్ అని అంటుంటారు. వీటివల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రతి రోజు రాత్రి 3, 4 అంజీరాలను నీటిలో వేసుకొని.. ఉదయం పరగడుపునే తింటే తక్షణ శక్తి లభిస్తుందని పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు. మరి ఈ అంజీరాలతో మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. బరువు తగ్గడం: అంజీరా బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఉదయాన్నే తినడం మంచిది. తద్వారా ఎక్కువ సమయం పాటు ఆకలి తెలియదు. ఇంకా అంజీరాలు జీర్ణం అయ్యేందుకు చాలా సమయం తీసుకుంటుంది. కడుపు నిండుగా ఉండడం వల్ల ఏది పడితే అది తినేయకుండా నియంత్రించుకోవచ్చు.
  2. జీర్ణ‌వ్య‌వ‌స్థ: అత్తిపండ్ల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగుప‌డుతుంది. ముఖ్యంగా మ‌లబ‌ద్ద‌కం త‌గ్గుతుంది. ఇవి జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యానికే కాక‌, మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలోనూ అమోఘంగా ప‌నిచేస్తాయి. వీటితో మలబద్ధకం సమస్య రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడేవారు తమ ఆహారంలో భాగంగా అంజీరాని రోజూ తప్పకుండా తినాలి.
  3. మధుమేహం: మధుమేహం ఉన్న వారు కూడా నీటిలో అంజీరాను నానవేసి తినవచ్చు. వీటిల్లో క్లోరోజెనిక్ యాసిడ్, పొటాషియం, ఒమెగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీంతో రక్తంలో గ్లూకోజ్ నియంత్రిత స్థాయిలో ఉంచడంలో వీటి పాత్ర ఎక్కువ.
  4. గుండె ఆరోగ్యం: అంజీరాని తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరాయిడ్స్ తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ పెరిగితే రక్త నాళాలు మూసుకుపోయి గుండె పోటు వస్తుందని తెలిసిందే. అంజీరాని రోజూ తినేవారికి ఈ సమస్య దాదాపుగా ఉండదు. ఎందుకంటే ఫిసిన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ అంజీర్‌ పండులో లభిస్తుంది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌ వేగంగా తగ్గించడానికి సహాయపడుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ఎముకలు దృఢత్వం: మహిళలు, వృద్ధులు, చిన్నారులకు క్యాల్షియం అవసరం ఎక్కువగా ఉంటుంది. అంజీరాని రోజూ తినేవారికి క్యాల్షియం తగినంత అందుతుంది. పొటాషియం, క్యాల్షియం కూడా ఆరోగ్యానికి మంచివే.
  7. గర్భిణులు: అంజీరాలో విటమిన్ బీ6, ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే డల్‌గా ఉండేందుకు వీటి లోపమే కారణం. గర్భిణులు అంజీరాని తినడంవల్ల ముందస్తు గర్భస్రావాలు తగ్గుతాయి.
  8. కేన్సర్ రిస్క్: అంజీరాతో కేన్సర్ రిస్క్ తగ్గించుకోవచ్చు. వీటిని నిత్యం తినడం ద్వారా బ్రెస్ట్, కొలన్ కేన్సర్ రిస్క్ ప్రధానంగా తగ్గుతుంది. ఫిగ్స్‌లో విటమిన్ సీ తగినంత ఉన్నందున వ్యాధి నిరోధక శక్తి కూడా బలోపేతం అవుతుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..