Fatty Liver: మహిళలకు అలర్ట్.. పెగ్నెన్సీ సమయంలో ఈ లక్షణాలు కనిపిస్తే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి

|

Apr 21, 2022 | 9:28 AM

Pregnancy Care: తల్లి కావాలనేది ప్రతి మహిళ కల.. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో, అంతకుముందు కూడా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. చాలా సార్లు మహిళలు గర్భధారణ సమయంలో

Fatty Liver: మహిళలకు అలర్ట్.. పెగ్నెన్సీ సమయంలో ఈ లక్షణాలు కనిపిస్తే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Pregnancy
Follow us on

Pregnancy Care: తల్లి కావాలనేది ప్రతి మహిళ కల.. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో, అంతకుముందు కూడా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. చాలా సార్లు మహిళలు గర్భధారణ సమయంలో ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం) లాంటి సమస్యలు వస్తుంటాయి. ఫ్యాటీ లివర్ అనేది ఆరోగ్య సమస్య.. దీనిని విస్మరించడం హానికరమని పేర్కొంటున్నారు వైద్య నిపుణులు. గర్భిణీలు ఇలాంటి ఆరోగ్య సమస్యను నిర్లక్ష్యం చేస్తే.. అది ఆమెకు, పుట్టబోయే బిడ్డకు హాని కలిగిస్తుంది. ఫ్యాటీ లివర్ (Fatty Liver) సమస్య ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది. గర్భిణీలకు ఈ ఫ్యాటీ లివర్ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఈ సమస్యకు సకాలంలో చికిత్స అందించకపోతే.. ఇది కాలేయ వైఫల్యానికి (లివర్ ఫేయిల్) కూడా దారితీస్తుందని, ఇది ప్రాణాంతకం అని నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రెగ్నెన్సీ సమయంలో పొత్తికడుపులో నొప్పితోపాటు కొన్ని లక్షణాలు కనిపిస్తే.. వారికి ఫ్యాటీ లివర్ సమస్య ఉండొచ్చని అర్థం చేసుకోవాలి. ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

కడుపు నొప్పి: గర్భిణుల్లో గ్యాస్ సమస్య తరచూ వస్తుంది. దీని కారణంగా పొట్ట మధ్యలో కడుపు నొప్పి కూడా ఉండవచ్చు. కడుపులో నొప్పి కొంత సమయం వరకు ఉంటుంది.. అయితే.. గ్యాస్ విడుదలైనప్పుడు అది బాగా వస్తుంది. అయితే. గర్భిణులకు కడుపు నొప్పి తగ్గకపోతే అది ఫ్యాటీ లివర్ లక్షణం కావచ్చు. వెంటనే వైద్యుల వద్దకు వెళ్లడం మంచిది.

వాంతులు లేదా వికారం: గర్భిణులకు వాంతులు లేదా వికారం వంటి సమస్యలు ఉండటం సర్వసాధారణం. అయితే, ఏదైనా తిన్న తర్వాత వాంతులు లేదా వికారం సమస్య కొనసాగితే దానిని నిర్లక్ష్యం చేయవద్దు. లివర్‌లో కొవ్వు నిల్వ ఉండడం వల్ల ఇలా జరుగుతోందని అనుకోవచ్చు. వాంతులు.. వికారం చాలా సేపటి వరకు ఉంటే వైద్యులను సంప్రదించాలి.

ఆయాసం: ఫ్యాటీ లివర్ మన జీర్ణవ్యవస్థ పనితీరుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. జీర్ణవ్యవస్థపై అదనపు భారం కారణంగా.. శరీరంలో శక్తి కూడా క్రమంగా అంతరిస్తుంది. దీంతో తీవ్రమైన అలసట వస్తుంది. గర్భిణీల్లో అధిక అలసట లాంటివి ప్రమాదకరం కావొచ్చు. గర్భధారణ సమయంలో మరింత అలసిపోయినట్లు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Also Read:

Baby Oil for Hair: బేబీ ఆయిల్‌తో జుట్టు సమస్యలకు చెక్.. ఇలా చేస్తే బోలెడన్ని ప్రయోజనాలు..

Coconut Water Benefits: ప్రతిరోజూ ఒక్క గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగితే బోలెడు లాభాలు.. హైబీపీతో పాటు అనేక సమస్యలకు చెక్..