Coronavirus: చాప కింద నీరులా విస్తరిస్తోన్న కరోనా.. దేశంలో ప్రస్తుత యాక్టివ్‌ కేసులు..

|

Dec 25, 2023 | 6:24 PM

యాక్టివ్‌ కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 63 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,742 నుంచి 4,054కు పెరిగింది. దేశంలో నమోదైన తాజాగా కేసుల్లో అత్యధికంగా కేరళలలో...

Coronavirus: చాప కింద నీరులా విస్తరిస్తోన్న కరోనా.. దేశంలో ప్రస్తుత యాక్టివ్‌ కేసులు..
Covid 19
Follow us on

మొన్నటి వరకు శాతించిన కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. ఇప్పుడిప్పుడే కాస్త ఉపశమనం లభిస్తుందని అనుకుంటున్న తరుణంలో మళ్లీ కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకీ యాక్టివ్‌ కేసులు క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 4 వేల మార్క్‌ను దాటినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

యాక్టివ్‌ కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 63 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,742 నుంచి 4,054కు పెరిగింది. దేశంలో నమోదైన తాజాగా కేసుల్లో అత్యధికంగా కేరళలలో 128 కేసులు నమోదయ్యాయి. ఆదివారం కరోనా కారణంగా ఒక వ్యక్తి మరణించాడు. ఇదిలా ఉంటే 24 గంటల్లో కోవిడ్‌ నుంచి 315 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4.44 కోట్లకు చేరింది.

రికవరీ రేటు 98.81 శాతంగా, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకూ దేశంలో 220.67 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇక తాజాగా వెలుగులోకి వచ్చిన జేఎన్‌1 వేరియంట్‌ ఓమిక్రాన్‌ వేరియంట్‌కి సబ్‌ వేరియంట్‌గా నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కొత్త వేరియంట్‌తో పెద్దగా భయపడాల్సిన పనిలేదని, రోగులు ఇంటి వద్దే సాధారణ లక్షణాల నుంచి కోలుకుంటారని నిపుణులు చెబుతున్నారు. అయినా ఈ కొత్త వేరియంట్‌తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు బహిరంగా ప్రదేశాల్లో కచ్చితంగా మాస్కులు ధరించాలని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణలోనూ కరోనా యాక్టివ్‌ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రతీ రోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇదే విషయమై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌లోని తిలక్‌ నగర్‌లో ఉన్న ఫీవర్‌ ఆసుపత్రిని సంరద్శించారు. కోవిడ్‌పై ఏర్పాట్లను పరిశీలించారు. కోవిడ్‌ విషయంలో కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు అలర్ట్‌ చేసిందన్న కిషన్‌ రెడ్డి, అవసరమైతే కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఆసుపత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..