Health: ఒత్తిడి, నిద్రలేమితో చిత్తవుతున్నారా.? అయితే చెరుకు వల్ల కలిగే ఈ ప్రయోజనం గురించి తెలుసుకోవాల్సిందే..

మారుతోన్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా ఒత్తిడి బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రతీచోట నెలకొన్న పోటీతత్వం కారణంగా ఒత్తిడి సర్వసాధారణంగా మారిపోయింది. దీంతో నిద్రలేమి వంటి సమస్యలు వెంటాడుతున్నాయి...

Health: ఒత్తిడి, నిద్రలేమితో చిత్తవుతున్నారా.? అయితే చెరుకు వల్ల కలిగే ఈ ప్రయోజనం గురించి తెలుసుకోవాల్సిందే..
Sugarcane Health Benefits

Updated on: Nov 03, 2022 | 11:55 AM

మారుతోన్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా ఒత్తిడి బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రతీచోట నెలకొన్న పోటీతత్వం కారణంగా ఒత్తిడి సర్వసాధారణంగా మారిపోయింది. దీంతో నిద్రలేమి వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. ఇది కాలక్రమేణ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో మెడిటేషన్‌లు, యోగాల బాట పట్టాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే నిద్రలేమి సమస్యకు ఆహారం ద్వారా కూడా చెక్‌ పెట్టవచ్చే విషయం మనందరికీ తెలిసిందే. నిద్రలేమి, ఒత్తడి సమస్యకు చెరకు దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ విషయాన్ని ఏదో ఆశామాషీగా కాకుండా పరిశోధనలు చేసి మరీ నిరూపించారు. జపాన్‌లోని సుకాబా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. చెరకులో ఉండే ఆక్టాకోసనాల్‌ అనే పదార్థం ఒత్తిడిని తగ్గించి, నిద్రలేమి సమస్యకు చెక్‌ పెడుతుందని పరిశోధనల్లో తేలింది. అక్టాకోసనల్‌ అనే సమ్మేళనం ఒత్తిడిన తగ్గించే హార్మోన్లను విడుదల చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పరిశోధనల ప్రకారం.. రక్త ప్లాస్మాలో కార్టికోస్టెరాన్ స్థాయి పెరగడం వల్ల మనుషుల్లో ఒత్తిడి పెరుగుతుంది. తీసుకునే ఆహారం నుంచి జీవన విధానం వరకు ఇలా ఎన్నో అంశాలు ఒత్తిడికి కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా రక్తపోటును ప్రేరేపించే ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, అతిగా ఆలోచించడం వంటివి డిప్రెషన్‌కు కారణాలుగా చెబుతున్నారు. అయితే జీవన విధానంలో పలు మార్పులు చేసుకోవడం, ప్రశాంతమైన జీవన విధానం ద్వారా ఒత్తిడిని కంట్రోల్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోట్‌: పైన తెలిపిన అంశాలు అధ్యయనాలు, నిపుణుల సూచన మేరకు అందించడం జరిగింది. ఆరోగ్యం విషయంలో ఏ నిర్ణయాన్నైనా వైద్యుల నిపుణుల సూచన మేరకు తీసుకోవడమే మంచిది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..