Abhyanga Oil Massage: మారుతున్న అలవాట్లలో భాగంగా స్నానం చేసి పనులు మొదలు పెట్టడం అన్న మాటను పక్కకి పెట్టేశాం.. అయితే ఇప్పటికీ మన ఇంట్లో పెద్దవారు.. పొద్దున్నే స్నానం చేసి.. తర్వాతనే ఇంటి పనులైనా వంటపనులైనా మొదలు పెడతారు. అయితే ఇలా స్నానం చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా అభ్యంగ స్నానం చేయడం వలన కలిగే ప్రయోజనాలను ఆయుర్వేదంలో తెలిపారు. రోజూ నూనెతో శరీరాన్ని చేసుకుని స్నానం చేస్తే.. శరీరం ధృడంగా మారుతుంది. అలసటను తగ్గిస్తుంది. అంతేకాదు నిద్రలేమి నుంచి ఉపశమనం కలిగిస్తుందట. ఇక చర్మం మెరుపుని సొంతం చేసుకుంది. దీర్ఘాయువుని ఇస్తుంది. . ఇది దోషాలను శాంతింపజేస్తుంది.
స్నానం చేసే ముందు శరీరానికి నువ్వుల నూనె, ఆవాలు నూనె, వెన్న ఇలా ఏదొక నూనెతో మసాజ్ చేసుకోవాలి. ఇలా శరీరానికి అప్లై చేసుకునే నూనెను కొంచెం వేడిగా చేసుకుంటే శరీరం మంచి రిలాక్స్ ను పొందుతుందని ఆయుర్వేదం పేర్కొంది. రోజూ ఇలా నూనెతో మసాజ్ చేసుకుని స్నానం చేయడం కుదరకపోతే./. వారంలో మూడు సార్లు చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయి.
అభ్యంగనం వల్ల ఉపయోగాలు
1. రక్త ప్రసరణ పెంచుతుంది
2. శరీరం నుండి మలినాలను తొలగిస్తుంది దుర్గంధం పోగొడుతుంది
3. వృదాప్యం ఛాయలను నివారిస్తుంది
4. చర్మాన్ని మృదువుగా, సున్నితంగా చేస్తుంది
5. వీర్య వృద్ది కలుగుతుంది
6.శరీరానికి మెరుపు, మృదుత్వం కలుగుతుంది.
7. పైత్యాన్ని నివారిస్తుంది
8 శరీరాన్ని దృఢం చేస్తుంది.
9. అలసట పోగొట్టి సుఖనిద్రనిస్తుంది
10. అరికాళ్ళు,చేతుల మంటలతో పాటు.. తల నొప్పిని కూడా నివారిస్తుంది.
ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయికనుకనే ఇప్పటికీ పెద్దవారు చిన్న పిల్లలకు స్నానానికి ముందు నూనెరాస్తారు. ఇక ఇప్పటికీ రోజూ కాకపోయినా వారంలో ఒకరోజు.. లేదా పండగ, శుభకార్యాల సమయంలో నైనా అభ్యంగ స్నానం చేయమని భావితరాలకు సూచిస్తున్నారు.
Also Read: ఇక్కడ ఆలయంలో అమ్మవారిని నేతిలో దర్శించుకుంటే.. భార్యాభర్తలు అనోన్యంగా జీవిస్తారట..