Artificial Sweetener: ఎనర్జీ డ్రింక్స్ తాగితే ఆ ‘శక్తి’ తగ్గిపోతుందట! నిపుణులు చెబుతున్న వివరాలు ఇవి..

|

Mar 20, 2023 | 2:20 PM

ఎనర్జీ డ్రింక్స్ నిజంగా ఎనర్జీని ఇస్తాయా? అవి ఆరోగ్యకరమేనా? అనే ప్రశ్నలు చాలానే ఉన్నాయి. అయితే ఆ ఎనర్జీ డ్రింక్స్ లో వాడే కృత్రిమ స్వీటెనర్ సుక్రలోజ్ వల్ల మాత్రం ఆరోగ్యంపై చాలా ప్రతికూల ప్రభావాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.

Artificial Sweetener: ఎనర్జీ డ్రింక్స్ తాగితే ఆ ‘శక్తి’ తగ్గిపోతుందట! నిపుణులు చెబుతున్న వివరాలు ఇవి..
Energy Drink
Follow us on

ఎనర్జీ డ్రింక్స్.. ప్రస్తుత కాలంలో విరివిగా వినియోగిస్తున్నారు. ఒకప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్, జిమ్ లలో కష్టపడే వారు మాత్రమే వినియోగించే వారు. కానీ ఇటీవల కాలంలో చాలా మంది అవసరం లేకపోయినా వాడేస్తున్నారు. అయితే అవి నిజంగా ఎనర్జీని ఇస్తాయా? అవి ఆరోగ్యకరమేనా? అనే ప్రశ్నలు చాలానే ఉన్నాయి. అలాగే ఆ ఎనర్జీ డ్రింక్స్ లో వాడే కృత్రిమ స్వీటెనర్ సుక్రలోజ్ వల్ల కూడా చాలా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యకర ఫలితాలు రాబట్టారు. ఎలుకలతో ఈ స్వీటెనర్ ను అధికమొత్తం తినిపించి ఫలితాలపై అధ్యయనం చేశారు. అయితే ఈ కృత్రిమ స్వీటెనర్ కారణంగా తెల్ల రక్త కణాలలోని టీ సెల్స్ ప్రభావితం అయ్యాయని వివరించారు. ఇది క్యాన్సర్ కారక కణాలపై ప్రతికూల ప్రభావం చూపినా.. టైప్ 1 డయాబెటిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వారికి కొన్ని ప్రయోజనకర ఫలితాలు ఉండే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే వ్యాధి నిరోధక శక్తిపై కూడా పెద్దగా ప్రభావం చూపలేదని నిర్ధారించారు. ఆ పరిశోధన వివరాలు తెలుసుకుందాం..

వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందా?

ఎనర్జీ డ్రింక్స్ అన్నింటిలో ఆర్టిఫీషియల్ స్వీటెనర్ వినియోగిస్తారు. దాని పేరు సుక్రలోజ్. ఇది చక్కెర కంటే 600 రెట్లు తియ్యగా ఉంటుంది. ఆహారం, పానీయాలలో ఉపయోగించబడుతుంది. అయితే శరీరంపై దీని ప్రభావాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. దీనిపై ఓ అధ్యయనానికి సంబంధించిన ఓ వివరాలను నేచర్ జర్నల్ లో ప్రచురించారు. దానిలో ఎలుకలపై ఈ సుక్రలోజ్ ప్రభావాలను వారు నోట్ చేశారు. సుక్రలోజ్ ను అధిక మోతాదులో ఎలుకలకు తినిపించారు. ఒక రోజులో 30 కప్పుల పంచదార కలిపిన కాఫీకి సమానమైన పరిమాణంలో దానిని ఇచ్చారు. అంటే 10 క్యాన్ల ఫిజీ ఎనర్జీ డ్రింక్స్ అన్నమాట. ఇలా అధిక మొత్తంలో సుక్రలోజ్ ను ఎలుకల చేత తినిపించినప్పుడు ఇన్‌ఫెక్షన్ లేదా క్యాన్సర్‌కు ప్రతిస్పందనగా ఒక రకమైన తెల్ల రక్త కణం టీ కణాలను సక్రియం చేయగలవని గుర్తించబడింది. ఇతర రోగనిరోధక శక్తినిచ్చే కణాలపై ఎటువంటి ప్రభావం చూపలేదు. అయితే ఇంకా అధిక మోతాదులో సుక్రలోజ్ ఇవ్వడం ద్వారా కొత్త ఫలితాలు రాబట్టడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.

చివరిగా తేల్చింది పరిశోధకులు తేల్చింది ఏంటంటే.. కృత్రిమ స్వీటెనర్ల వినియోగం అరోగ్యానికి అంత మంచిది కాదు. అయితే అది తీసుకునే మోతాదును బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తిపై కూడా దాని ప్రభావం అంతంతమాత్రంగా ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. అవసరం మేరకు తగు మోతాదులో ఏది తీసుకున్న శరీరానికి మంచి చేస్తుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..