Cancer: 50 ఏళ్లలోపు ఉన్నవారిలో 79 శాతం పెరిగిన క్యాన్సర్‌ కేసులు.. సంచలన విషయాలు వెల్లడించిన నివేదిక

|

Sep 06, 2023 | 2:16 PM

ప్రపంచవ్యాప్తంగా భయాందోళన కలిగించే వ్యాధుల్లో ఒకటి క్యాన్సర్. వీటి కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అయితే ఈ క్యాన్సర్‌పై ఓ అధ్యయనం తాజాగా ఆందోళనకరమైన విషయాలను బయటపెట్టింది. 50 ఏళ్ల లోపు ఉన్నవారిలో కొత్తగా క్యాన్సర్ బారిన పడిన వారి సంఖ్య ఏకంగా 79 శాతం పెరిగిందని ప్రముఖ జర్నల్ బీఎంజే ఆంకాలజీ పేర్కొంది. గత 30 సంవత్సరాలకు సంబంధించినటువంటి వివరాలను ఇది బయటపెట్టింది. స్కాట్‌లాండ్‌లోని ఎడిన్‌బర్‌ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు.

Cancer: 50 ఏళ్లలోపు ఉన్నవారిలో 79 శాతం పెరిగిన క్యాన్సర్‌ కేసులు.. సంచలన విషయాలు వెల్లడించిన నివేదిక
Cancer Patient
Follow us on

ప్రపంచవ్యాప్తంగా భయాందోళన కలిగించే వ్యాధుల్లో ఒకటి క్యాన్సర్. వీటి కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అయితే ఈ క్యాన్సర్‌పై ఓ అధ్యయనం తాజాగా ఆందోళనకరమైన విషయాలను బయటపెట్టింది. 50 ఏళ్ల లోపు ఉన్నవారిలో కొత్తగా క్యాన్సర్ బారిన పడిన వారి సంఖ్య ఏకంగా 79 శాతం పెరిగిందని ప్రముఖ జర్నల్ బీఎంజే ఆంకాలజీ పేర్కొంది. గత 30 సంవత్సరాలకు సంబంధించినటువంటి వివరాలను ఇది బయటపెట్టింది. స్కాట్‌లాండ్‌లోని ఎడిన్‌బర్‌ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. అయితే ఈ అధ్యయనంలో వాళ్లు పలు కీలక విషయాలు వెల్లడించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్వాసనాళం, ప్రోస్ట్రేట్‌ క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా పెరిపోయాయని తమ పరిశోధనలో తేలినట్లు ఆ జర్నల్ పేర్కొంది.

రొమ్ము, శ్వాసనాళం, ఊపిరితిత్తులు, పేగు, ఉదర క్యాన్సర్ల వల్లే మరణాలు ఎక్కువగా వస్తున్నట్లు వెల్లడించింది. 1990వ సంవత్సరం నుంచి ముఖ్యంగా ఈ శ్వాసనాళం, ప్రోస్ట్రేట్‌ క్యాన్సర్‌ కేసులు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయని తెలిపింది. అలాగే తక్కువ వయసులోనే గుర్తించినటువంటి క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ కేసులు 2019లో ఎక్కువగా వచ్చినట్లు చెప్పారు. తక్కువ వయసులో ఉండగానే క్యాన్సర్ వచ్చే సంభావ్యత 2030వ సంవత్సరంలో 31 శాతానికి పెరగుతుందని ఈ అధ్యయనం తెలిపింది. అలాగే ఈ క్యాన్సర్‌కు సంబంధించిన మరణాల సంఖ్యను కూడా చూసుకుంటే దాదాపు 21 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేసింది. 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి ఈ క్యాన్సర్ ముప్పు అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అయితే కొత్త కాలేయ క్యాన్సర్ కేసులు వెలుగుచూడటం మాత్రం ప్రతి సంవత్సరం దాదాపు 2.88 శాతం తగ్గిందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్ల లోపు ఉన్నవారిలో ఒక్క 2019వ సంవత్సరంలోనే క్యాన్సర్ వల్ల 10 లక్షల మంది మరణించినట్లు ఆ అధ్యయనం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

రొమ్ము క్యాన్సర్ తర్వాత ఎక్కువమంది శ్వాసనాళం, ఉపరితిత్తులు, ఉదరం, పేగు క్యాన్సర్‌తో మరణాలు సంభవిస్తున్నట్లు పేర్కొంది. కిడ్నీ, అండాశయ క్యాన్సర్ల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా పెరిగినట్లు వెల్లడించింది. ఇక క్యాన్సర్ బారిన పడటానికి జన్యుపరంగా అంశాలు కూడా ఒక కారణమని చెప్పింది. అలాగే రెడ్ మీట్, ఉప్పు ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలని తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు పెంచే కారకాల్లో ఇది ఒకటని పేర్కొంది. అలాగే ఆల్కహాల్, పొగాకు కూడా క్యాన్సర్‌కు దారి తీస్తుందని పరిశోధకులు చెప్పారు. శారీరక శ్రమ లేకపోవడం.. అధికంగా బరువు ఉండటం.. అధికంగా బీపీ ఉండటం వల్ల కూడా క్యాన్సర్ ముప్పు పెంచుతున్నట్లు అధ్యయనం తెలిపింది. ఇదిలా ఉండగా క్యాన్సర్ వల్ల ఇలా మరణాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆరోగ్యంపై అశ్రద్ధ వహిస్తే వ్యాధుల ముప్పులు తప్పవని నిపుణలు హెచ్చరిస్తున్నారు.