18ఏళ్ల యువతి ప్రాణం తీసిన ఫ్యాషన్‌ డైట్.. బరువు తగ్గాలనే మోజుతో ఏకంగా చావు నోట్లోకే..

క్రాష్ డైట్‌లు, వాటర్ ఫాస్టింగ్ ప్రజాదరణ పొందుతున్నప్పటికీ అవి వేగంగా బరువు తగ్గడానికి ప్రమాదకరమైన పద్ధతులు అంటున్నారు వైద్యులు. కాబట్టి, ఇలాంటి ప్రాణాంతక పద్ధతులు అనుసరించే వారు ఎప్పటికప్పుడు డాక్టర్స్‌ని సంప్రదించాలని, లేదంటే, ప్రాణాలకే ముప్పు తప్పదని హెచ్చరించారు. వేగంగా బరువు తగ్గడానికి పాటించే ఇటువంటి పద్ధతులు ప్రాణాంతకం కూడా కావచ్చు అంటున్నారు.

18ఏళ్ల యువతి ప్రాణం తీసిన ఫ్యాషన్‌ డైట్.. బరువు తగ్గాలనే మోజుతో ఏకంగా చావు నోట్లోకే..
Water Fasting

Updated on: Mar 11, 2025 | 2:05 PM

ఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది ప్రతి ఒక్కరి సాధారణ సమస్య.. ఇందుకోసం చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు జిమ్ లకు వెళ్తుంటారు. కొందరు మితిమీరిన ఎక్సర్ సైజులు చేస్తుంటారు. మరికొందరు డైటింగ్ అంటారు. ఇంకొందరు అడపాదడపా ఉపవాసం చేస్తుంటారు. ఈ రోజుల్లో ఊబకాయం తగ్గించుకోవడానికి చాలా మంది ఈ ట్రెండ్‌ని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. బరువు తగ్గడానికి ఉపవాసం ఒక గొప్ప మార్గం. అంతేకాకుండా, ఇది ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఎక్కువ రోజుల పాటు దీనిని అనుసరిస్తూ ఉంటే.. అది ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంటుంది. సరిగ్గా ఇలాంటిదే ఘటనే కేరళలో చోటు చేసుకుంది…ఆన్‌లైన్‌లో విపరీతంగా ట్రెండ్‌ అవుతున్న వాటర్‌ ఫాస్టింగ్‌ విధానంతో ఒక 18ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

కేరళలోని తలస్సేరీలో జరిగిన ఒక హృదయ విదారక సంఘటన ఆన్‌లైన్ ట్రెండ్‌ల ప్రభావంతో విపరీతమైన డైటింగ్ వల్ల కలిగే ప్రాణాంతక పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. బరువు తగ్గాలనే పిచ్చి ఆరాటంతో 18 ఏళ్ల బాలిక సుదీర్ఘమైన నీటి ఉపవాసం చేసింది. దీంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురైంది. దాదాపు ఆరు నెలలుగా ఆహారం తీసుకోవటం మానేసింది. చివరకు ఆ యువతి మరణానికి 12 రోజుల ముందు తలస్సేరీ కో-ఆపరేటివ్ హాస్పిటల్‌లోని ఐసియులో చేరింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆమె కోలుకోలేకపోయింది. చివరకు ప్రాణాలు విడిచింది.

వాస్తవానికి, ఆ అమ్మాయి ఆన్‌లైన్ పోర్టల్స్ ప్రభావానికి లోనై కఠినమైన వాటర్‌ ఫాస్టింగ్‌ ప్రారంభించింది. దీంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. డైటింగ్ పేరుతో ఆమె దాదాపు 6 నెలలు ఆహారం తీసుకోవడం మానేసిందని తెలిసింది. యువతి పరిస్థితి విషమించడంతో ఆమె చనిపోవడానికి 12 రోజుల ముందు ఆమెను తలసేరి సహకార ఆసుపత్రిలోని ఐసియులో చేర్చారు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆమె ప్రాణం నిలబెట్టలేకపోయారు. ఉపవాసంతో ఆమె బరువు పూర్తిగా తగ్గిపోయింది. చివరకు కేవలం 24 కిలోలకు చేరింది. దాంతో ఆమె మంచం పట్టింది. బాడీలో బ్లడ్‌షుగర్‌ లెవల్స్‌, సోడియం, రక్తపోటు పూర్తిగా పడిపోయాయి. వెంటిలేటర్‌పై ఉంచారు. అయినప్పటికీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. చివరకు ఆమె మరణించినట్టుగా ఆసుపత్రి కన్సల్టెంట్ వైద్యుడు డాక్టర్ నాగేష్ మనోహర్ ప్రభు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

క్రాష్ డైట్‌లు, వాటర్ ఫాస్టింగ్ ప్రజాదరణ పొందుతున్నప్పటికీ అవి వేగంగా బరువు తగ్గడానికి ప్రమాదకరమైన పద్ధతులు అంటున్నారు వైద్యులు. కాబట్టి, ఇలాంటి ప్రాణాంతక పద్ధతులు అనుసరించే వారు ఎప్పటికప్పుడు డాక్టర్స్‌ని సంప్రదించాలని, లేదంటే, ప్రాణాలకే ముప్పు తప్పదని హెచ్చరించారు. వేగంగా బరువు తగ్గడానికి పాటించే ఇటువంటి పద్ధతులు ప్రాణాంతకం కూడా కావచ్చు అంటున్నారు.

Fasting, Hospital, India