ఆందోళన విరమించిన భారతీయ కిసాన్ యూనియన్.. రైతు డిమాండ్లకు మంత్రి సానుకూలంగా స్పందించడంతో..

ఉత్తర ప్రదేశ్‌కి చెందిన భారతీయ కిసాన్ యూనియన్ రైతు ఆందోళనను విరమించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి

ఆందోళన విరమించిన భారతీయ కిసాన్ యూనియన్.. రైతు డిమాండ్లకు మంత్రి సానుకూలంగా స్పందించడంతో..
Follow us

|

Updated on: Dec 16, 2020 | 5:43 AM

ఉత్తర ప్రదేశ్‌కి చెందిన భారతీయ కిసాన్ యూనియన్ రైతు ఆందోళనను విరమించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌తో చర్చలు ఫలించడంతో ఆందోళన విరమించినట్లుగా ప్రకటించింది. అయితే మంత్రితో చర్యల్లో భాగంగా వీరు కొన్ని హామీలను డిమాండ్ చేశారు. అందులో ముఖ్యంగా.. ప్రైవేట్ వ్యక్తులు ధాన్యం కొనుగోలు చేసినప్పుడు వివాదాలు ఏర్పడితే సివిల్ కోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. గ్రామాలు, పట్టణాలలో రైతుల హక్కుల పరిరక్షణ కోసం మండీ అధినేతతో పాటు పంచాయతీ పెద్దకు అధికారం ఇవ్వాలని సూచించారు.

ఉత్తరప్రదేశ్‌లో తక్కువ ధరకే ఎక్కువ గంటల పాటు విద్యుత్ అందించాలన్నారు. ధాన్యం సేకరణ దగ్గరే పంట ప్రమాణాలను గుర్తించాలని కోరారు. నిత్యావసర సరుకుల్లో బ్లాక్ మార్కెట్, కృత్రిమ కొరత నుంచి కాపాడాలన్నారు. అంతేకాకుండా మండీల బయట విక్రయించే ఉత్పత్తులపై కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల్లో ఏ ఒక్కటి పరిష్కరించకున్నా మళ్లీ ఆందోళన చేస్తామని హెచ్చిరించారు. కిసాన్ యూనియన్ సభ్యల డిమాండ్స్‌కి సానుకూలంగా స్పందించిన మంత్రి నరేంద్రసింగ్ తోమర్ బీకేయూ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన వ్యవసాయ చట్టాలకు చాలా రాష్ట్రాలు మద్దతు తెలుపుతున్నాయని అన్నారు. అంతేకాకుండా మిగతా రైతు సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రకటించారు. ధాన్యం సేకరణకు ఎప్పటిలాగే కనీస మద్దతు ధర కొనసాగుతుందని వెల్లడించారు.