Farmers Protest: రైతు ఉద్యమం ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం..
Farmers Protest: రైతు ఆందోళనల నేపథ్యంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.

Farmers Protest: రైతు ఆందోళనల నేపథ్యంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు చేపట్టిన ఉద్యమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను నిషేధించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ఆ నిషేధాన్ని పొడగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధాజ్ఞలు ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. తొలుత ఢిల్లీ సరిహద్దుల్లోని రెండు జిల్లాల్లో మాత్రమే ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించిన రాష్ట్ర సర్కార్.. ఇప్పుడు మొత్తం 16 జిల్లాల్లో అమలు చేస్తోంది. ఈ నిషేధానికి సంబంధించి తదుపరి ప్రకటన వచ్చేంత వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదిలాఉంటే.. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు కేంద్రం హోంమంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, ఘజియాపూర్ తో పాటు సమీప ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధాజ్ఞలు ఆదివారం రాత్రి 11 గంటల వరకు అమల్లో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. కాగా, మరోవైపు రైతులను ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేయించేందుకు పోలీసులు రంగం చేస్తున్నారు. ఇప్పటికే రైతు సంఘాలకు నోటీసులు జారీ చేశారు. ఆ క్రమంలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి కూడా.
Also read: