
ప్రముఖ జీ తెలుగు చానెల్ అభిమానులను అలరించేందుకు సరికొత్తగా సిద్ధమవుతోంది. కొత్త సంవత్సరాన్ని నూతన షోలతో ప్రారంభించనుంది. 2021 ఏడాదిని పార్టీకి వేళాయెరా (న్యూ ఇయర్ ఇవెంట్), బిగ్ సెలబ్రెటీ ఛాలెంజ్ సీజన్ 5 షోతో మొదలెట్టనుంది.
జీ తెలుగు కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌ను ముందుగానే ప్రారంభించనుంది. డిసెంబర్ 27నే న్యూ ఇయర్ ఇవెంట్ పార్టీకి వేళాయెరా షోను ప్రసారం చేయనుంది. జీ తెలుగు చానెల్‌లో నటించే నటీనటులు కలిసి ఈ వేడుకలో కనిపించనున్నారు. 2020కి వైరటీగా గుడ్ బై చెప్పనున్నారు. టీవీ చరిత్రలోనే అతిపెద్ద కేకును కట్ చేసి ఈ ఏడాదికి వీడ్కోలు పలుకనున్నారు. డిసెంబర్ 27 సాయంత్రం 6 గంటలకు ఈ షోను టెలికాస్ట్ చేయనున్నారు.
డిసెంబర్ 27 రాత్రి 9 గంటలకు జీ తెలుగులో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ షోను ప్రసారం చేయనున్నారు. ఈ చానెల్‌లో గతంలో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ 4 సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో 5 సీజన్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ షోను యాంకర్ రవి, సుమ కనకాల హోస్ట్ చేయనున్నారు. కాగా, ఫస్ట్ ఎపిసోడ్‌కు ముఖ్య అతిథులుగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2, 3 విజేతలు కౌశల్, రాహుల్ హాజరయ్యారు.