Nithin: మరో సినిమాను పట్టాలెక్కించిన నితిన్‌.. ‘పెళ్లి సందD’ ముద్దుగుమ్మ జంటగా..

Nithin: చెక్‌, రంగ్‌దే, మాస్ట్రో వంటి మూడు వరుస పరాజయాలతో ఢీలా పడ్డ యంగ్‌ హీరో నితిన్‌ మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కేందుకు తీవ్రంగా కృష్టి చేస్తున్నాడు. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam) సినిమాను పూర్తి...

Nithin: మరో సినిమాను పట్టాలెక్కించిన నితిన్‌.. పెళ్లి సందD ముద్దుగుమ్మ జంటగా..
Nithin New Movie

Updated on: Apr 04, 2022 | 9:46 AM

Nithin: చెక్‌, రంగ్‌దే, మాస్ట్రో వంటి మూడు వరుస పరాజయాలతో ఢీలా పడ్డ యంగ్‌ హీరో నితిన్‌ మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కేందుకు తీవ్రంగా కృష్టి చేస్తున్నాడు. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam) సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి మళ్లీ సక్సెస్‌ బాట పట్టాలని చూస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా పూర్తి అవ్వకముందే మరో సినిమాను మొదలుపెట్టేశాడీ యంగ్‌ హీరో. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. ఆదివారం పూజ కార్యక్రమంతో సినిమాను ప్రారంభించారు.

ఈ సినిమాలో నితిన్‌ను జోడిగా పెళ్లిసందD ఫేమ్‌ శ్రీలీలా నటిస్తోంది. ముహుర్తపు సన్నివేశానికి నిర్మాత రామ్మోహన్‌రావు క్లాప్‌ కొట్టగా.. ఆదిత్యా మ్యూజిక్‌ ఉమేశ్‌ గుప్తా కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ప్రొడక్షన్‌ నెంబర్‌ 9 పేరుతో ప్రారంభించిన ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే మొదలు పెట్టనున్నారు. ఇక ఈ సినిమా అన్ని కమర్షియల్‌ హంగులు కలబోసినదని, ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథను అందించిన వక్కంతం వంశీ.. నితిన్‌ సరికొత్తగా చూపించబోతున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. నితిన్‌ ప్రస్తుతం హీరోగా తెరకెక్కుతోన్న ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాను జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా నితిన్‌ కెరీర్‌ను మలుపు తిప్పుతుందో లేదో చూడాలి.

Also Read: Lipstick Side Effects: లిప్‌స్టిక్‌ ఎక్కువగా వాడుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..

Primeval Foods: త్వరలో అంగడిలో అమ్మకానికి సింహం, పులి, ఏనుగు మాంసాలు.. వెరైటీ వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్‌కి రెడీ.. ఎక్కడంటే

LSG VS SRH IPL 2022 Match Preview: హైదరాబాద్ సత్తా చాటేనా.. లక్నోతో పోరుకు సిద్ధం.. ప్లేయింగ్ XIలో కీలక మార్పులు