Lipstick Side Effects: లిప్‌స్టిక్‌ ఎక్కువగా వాడుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..

ఆడాళ్లకు మేకప్ కిట్‌కు విడదీయలేని సంబంధం ఉంటుంంది. ఇక ఇందులో లిప్‌స్టిక్(Lipstick) అంటే చాలా ఇష్టం...

Lipstick Side Effects: లిప్‌స్టిక్‌ ఎక్కువగా వాడుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..
Lipstick
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Apr 04, 2022 | 8:57 AM

ఆడాళ్లకు మేకప్ కిట్‌కు విడదీయలేని సంబంధం ఉంటుంంది. ఇక ఇందులో లిప్‌స్టిక్(Lipstick) అంటే చాలా ఇష్టం. లిప్‌స్టిక్ లేనిదే బయటకు ఒక్క అడుగు కూడా పెట్టని వారు చాలా మందే ఉన్నారు. కొందరైతే 24 గంటలు పెదాలకు లిప్‌స్టిక్‌తోనే ఉంటారు. మరి లిప్‌స్టిక్‌ ప్రియులకు ఓ షాకింగ్ న్యూస్ వచ్చింది. లిప్‌స్టిక్‌ గురించి ఈ షాకింగ్ విషయాలు తెలిస్తే మీరు లిప్‌స్టిక్‌ జోలికి వెళ్లరేమో. అదరాలను రంగులను అద్దడం వల్ల చాలా దుష్ప్రలితాలు ఉన్నాయి. లిప్‌స్టిక్‌లో క్రోమియం(Chromium), మెగ్నీషియం, లెడ్(Led) , కాడ్మియం, పెట్రో కెమికల్స్‌ను వాడతారు. ఇన్ని కెమికల్స్ కలిసిన లిప్‌స్టిక్‌ను పెదాలకు పెడితే అవి శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది. కాడ్మియం అనే కెమికల్ వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. అంతేకాదు కడుపులో కణితులు కూడా ఏర్పడేృ అవకాశం ఉంది.

లెడ్ కెమికల్ వల్ల నాడీవ్యవస్థపై దుష్ప్రభావం పడుతుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. వంధత్వం, హర్మోన్ల అసమతుల్యత కూడా ఏర్పడుతుంది. లిప్‌స్టిక్‌లో ఉండే కెమికల్స్ క్యాన్సర్ బారిన పడేసే ప్రమాదం ఉంది. ఇందులో కలిపే పెట్రో కెమికల్ వల్ల తెలివితేటలు మందగించే అవకాశం ఉంది. అలాగే పునరుత్పత్తి వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. అంతేకాదు శారీర ఎదుగుదల కూడా ఆగిపోతుందట. చర్మం ఇరిటేట్ అవడం, శ్వాసలో ఆటంకం కలిగి గురక వస్తుందట. లిప్‌స్టిక్‌లో యూజ్ చేసే బిస్మత్ ఆక్సీ క్లోరైడ్ , పారాబెన్స్ వల్ల క్యాన్సర్ సోకే అవకాశం చాలా వరకు ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ రసాయనాల వల్ల బాడీలో ఉండే అవయవాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు.

అదరాలను అందంగా మార్చే లిప్‌స్టిక్‌ వల్ల ఎలాంటి నష్టం కలుగుతుందో తెలిసింది కదా.. ఇప్పటికైనా లిప్ స్టిక్‌కు దూరంగా ఉండండి. అప్పుడే మీ ఆరోగ్యం బావుంటుంది. లేదంటే మీ చేతులార మీరే మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకున్న వారవుతారు. మీతు అంతగా కావాలంటే సహజ సిద్ధంగా రెడ్‌ కలర్‌ పూవ్వులతో తయారు చేసుకున్న కలర్‌ పెదలకు వాడొచ్చు.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Read Also.. Eggs: వేసవిలో కోడిగుడ్లు తింటే వేడి చేస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..