Yashoda: సమంత పట్టుదల ముందు కండరాల బలహీనత సైతం బలాదూర్‌.. యశోద కోసం సామ్‌ పడ్డ కష్టం చూస్తే..

సమంత హీరోయిన్‌ తెరకెక్కిన సినిమా యశోద. ఈ చిత్రాన్ని సరోగసి నేపథ్యంలో థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కించారు. ఈనెల 11న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇక పేరుకు హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రమే..

Yashoda: సమంత పట్టుదల ముందు కండరాల బలహీనత సైతం బలాదూర్‌.. యశోద కోసం సామ్‌ పడ్డ కష్టం చూస్తే..
Yasoda Making Video

Updated on: Nov 08, 2022 | 5:23 PM

సమంత హీరోయిన్‌ తెరకెక్కిన సినిమా యశోద. ఈ చిత్రాన్ని సరోగసి నేపథ్యంలో థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కించారు. ఈనెల 11న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇక పేరుకు హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రమే అయినప్పటికీ ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలకు ఏమాత్రం కొదవలేదని ట్రైలర్‌ చెప్పకనే చెప్పింది. ఇక యశోద చిత్రానికి సమంత పెట్టిన డెడికేషన్‌కు ఆమె ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. యాక్షన్‌ సన్నివేశాల్లో అద్భుత నటనతో మెప్పించిన సామ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా యశోద చిత్రానికి సంబంధించిన ఓ మేకింగ్ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.

ఇక యశోద సినిమా షూటింగ్ సమయానికి సమంత మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసిపోయింది. అయినా కూడా డెడికేషన్‌ విషయంలో మాత్రం ఏమాత్రం వెనుకడుగు వేయలేదు సామ్‌. యాక్షన్‌ సన్నివేశాల్లో అలవోకగా నటించింది. మయోసైటిస్‌ కండరాల బలహీనతకు సంబంధించిన వ్యాధి అయినప్పటికీ తనదైన డెడికేషన్‌తో యాక్షన్‌ సన్నివేశాల్లో మెప్పించింది. తాజాగా యాక్షన్‌ సన్నివేశాలకు సంబంధించి చిత్ర యూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. యశోద చిత్రానికి యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన యానిక్‌ బెన్‌ యాక్షన్‌ సన్నివేశాల గురించి వివరిస్తున్న వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే సమంత షూటింగ్ సమయంలో తనకు వ్యాధి ఉందని చిత్ర యూనిట్‌కు సైతం చెప్పలేదు. ఈ విషయాన్ని నిర్మాత స్వయంగా తెలిపారు. ఇక డబ్బింగ్‌ సమయంలో సమంత ఆరోగ్యం గురించి తెలుసుకున్న నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ హిందీ డబ్బింగ్‌ను వేరే వాళ్లతో చెప్పించాలని ప్రయత్నించారు. కానీ సమంత మాత్రం తమిళ ప్రేక్షకులందరికి తన వాయిస్ తెలుసు కాబట్టి తానే చెబుతానని ఆరోగ్యం సహకరించకపోయినా డబ్బింగ్‌ను పూర్తి చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..