Kamal Haasan Comments : త్వరలోనే రజినీకాంత్‌ని కలుస్తా.. నాకు మద్దతు ఇవ్వమని కోరుతా.. కమల్ హాసన్ కామెంట్స్

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Jan 07, 2021 | 12:50 PM

పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తతో తమిళనాడులో సంచలనం సృష్టించారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు తలెత్తడంతో అనూహ్యంగా...

Kamal Haasan Comments : త్వరలోనే రజినీకాంత్‌ని కలుస్తా.. నాకు మద్దతు ఇవ్వమని కోరుతా.. కమల్ హాసన్ కామెంట్స్

Kamal Haasan Comments  : పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తతో తమిళనాడులో సంచలనం సృష్టించారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు తలెత్తడంతో అనూహ్యంగా ఆయన రాజకీయాలనుంచి తప్పుకున్నారు. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మక్కల్ నీది మయ్యమ్ పార్టీకి మద్దతివ్వాలని సూపర్ స్టార్ రజినీకాంత్‌ను కోరుతానని ఆ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ తెలిపారు. తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికలు నిజాయితీకి, అవినీతికి మధ్య జరిగేవి అని కమల్ అన్నారు. రజినీ తనకు మంచి స్నేహితుడు అని పేర్కొన్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానన్న రజనీకాంత్ నిర్ణయం ఆయన అభిమానులలాగే తననూ తీవ్ర నిరాశకు గురి చేసిందని కమల్ హాసన్ గతంలో వ్యాఖ్యలు చేసారు. అయితే ఆయన ఆరోగ్యమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. తన ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత రజనీకాంత్‌ను కలుస్తానని కమల్ చెప్పారు.

 మరిన్ని ఇక్కడ చదవండి: 

Vakeel Saab : వైరల్ అవుతున్న’వకీల్ సాబ్’ ఫోటోలు.. సంబరపడుతున్న అభిమానులు

12 ‘O’ Clock Movie : పొంగల్ బరిలో వర్మ కూడా.. అసలైన పండుగ ’12 O’Clock’ తోనే అట

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu