టాలీవుడ్‌లో ఉన్న వైవిధ్య దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కథాంశాలతో సినిమాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు.. ఉత్తమ దర్శకుడిగా మూడు సార్లు నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ దర్శకుడు తెరకెక్కించిన చిత్రాలన్నీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్‌ను కొట్టాలని భావించిన ఈ దర్శకుడు.. ఓ మరాఠీ రీమేక్‌తో రాబోతున్నాడు. మరాఠిలో మంచి విజయం సాధించిన ‘నటసామ్రాట్’ రీమేక్‌కు కృష్ణ వంశీ దర్శకత్వం వహించబోతున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
Prakash Raj and Ramya Krishnan… #RangaMaarthaanda – the official #Telugu remake of #Marathi classic #Natsamrat – announced… Directed by Krishna Vamsi… Produced by Abhishek Jawkar and Madhu Kalipu. pic.twitter.com/p09xSiSeiK
— taran adarsh (@taran_adarsh) October 16, 2019
రంగమార్తాండ పేరుతో ఈ మూవీ తెరకెక్కబోతుండగా.. ఇందులో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణలు ప్రధాన పాత్రలలో నటించబోతున్నారు. రెడ్‌బల్బ్ మూవీస్, హౌస్‌ఫుల్ మూవీస్, ఎస్వీఆర్ గ్రూప్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు ప్రీ ప్రొడక్షన్ పనులు జరగుతుండగా.. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా తెలియనున్నాయి.
కాగా కృష్ణవంశీ, రమ్యకృష్ణ భార్య భర్తలన్న విషయం తెలిసిందే. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘చంద్రలేఖ’, ‘శ్రీ ఆంజనేయం’ చిత్రాల్లో రమ్యకృష్ణ కనిపించింది. అలాగే ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో వారిద్దరితో కలిసి కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు స్టార్ట్ అయ్యాయి.