AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Antony: ఇక జీవితాంతం ఇలాగే.. ‘బిచ్చగాడు’ హీరో చెప్పులు, షూస్ ఎందుకు వేసుకోరో తెలిస్తే కన్నీళ్లాగవు..

ప్రముఖ కోలీవుడ్ హీరో, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనిని గమనించారా? ఆయన గత కొన్ని నెలలుగా చెప్పులు, షూస్ లేకుండానే తిరుగుతున్నాడు. సినిమా షూటింగ్ లో అది కూడా అత్యవసరమైతే తప్ప షూస్ ధరించడం లేదు. అయితే విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం వెనక ఓ కన్నీటి కథ ఉంది.

Vijay Antony: ఇక జీవితాంతం ఇలాగే..  'బిచ్చగాడు' హీరో చెప్పులు, షూస్ ఎందుకు వేసుకోరో తెలిస్తే కన్నీళ్లాగవు..
Vijay Antony
Basha Shek
|

Updated on: Nov 17, 2026 | 9:51 PM

Share

బిక్షగాడు సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా దగ్గరైపోయాడు కోలీవుడ్ హీరో కమ్ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని. అప్పటి నుంచి ఆయన నటిస్తోన్న ప్రతి తమిళ సినిమా తెలుగులోనూ రిలీజవుతోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. విజయ్ ఆంటోని గత కొంతకాలంగా చెప్పులు, షూస్ ధరించడం లేదు. బహిరంగ ప్రదేశాల్లోనూ ఆయన ఖాళీ కాళ్లతోనే కనిపిస్తున్నారు. మరి స్టార్ సెలబ్రిటీ అయిన విజయ్ ఆంటోని కాళ్లకు ఎలాంటి పాదరక్షలు లేకుండా ఎందుకు తిరగుతున్నాడన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై విజయ్ ఆంటోని సతీమణి, ప్రముఖ నిర్మాత పాతిమా విజయ్ ఆంటోని పూర్తి క్లారిటీ ఇచ్చారు. తన లేటెస్ట్ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ఆమె ఈ విషయంపై స్పందిస్తూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. కొన్నేళ్ల క్రితం చనిపోయిన తన కూతురి జ్ఞాపకార్థమే విజయ్ ఆంటోని ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నారని ఫాతిమా కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా 2023లో విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా విజయ్ ఆంటోనీ ఆత్మహత్య చేసుకుంది. ఈ వార్త విజయ్ కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ క్రమంలోనే 2023లో తన పెద్ద కుమార్తె మరణించినప్పటి నుంచి విజయ్ ఆంటోనీ బహిరంగ ప్రదేశాలలో చెప్పులు ధరించడం మానుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయనను ఎందుకలా ఉన్నారని అడగ్గా, తాను అలసిపోవడం వల్లే అలా ఉన్నానని సమాధానమిచ్చారు.

తాజాగా విజయ్ ఆంటోనీ నటించిన ‘అప్పా కుట్టి’ సినిమా వేడుకలో నిర్మాత ఫాతిమా విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ మరోసారి ఈ విషయంపై స్పందించారు. తమ కూతురు మీరా అకాల మరణం చెందిన తర్వాత విజయ్ ఆంటోని మానసికంగా ఎంతగా కుంగిపోయారో చెబుతూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. మీరా కాలేజీకి వెళ్లడం కోసం వివిధ దేశాల నుంచి సుమారు యాభైకి పైగా ఖరీదైన రకరకాల షూస్‌ను విజయ్ కొనుగోలు చేసి ఇంట్లో ఉంచినట్లు ఫాతిమా తెలిపారు. అయితే ఆమె వాటిని ధరించకుండానే దూరమైపోవడంతో, ఆ షూస్ అన్నీ ఇంట్లోనే అలానే మిగిలిపోయాయని ఆమె వాపోయారు. కూతురు వాడకుండా మిగిలిపోయిన ఆ పాదరక్షలను చూసిన విజయ్ ఆంటోని చలించిపోయారని, ఇకపై తన జీవితంలో ఎప్పుడూ ఎలాంటి చెప్పులు లేదా షూస్ ధరించనని ఆయన శపథం చేశారని ఫాతిమా ఎమోషనల్ అయ్యారు. కేవలం విదేశాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో జరిగే లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌లకు వెళ్లినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే పాదరక్షలు ధరిస్తారని, కాన్సర్ట్ ముగియగానే వెంటనే వాటిని తొలగిస్తారని ఆమె తెలిపారు. అంతేకాకుండా రోలెక్స్, రాడో వంటి ఖరీదైన వాచ్‌లను పక్కన పెట్టి, తన కూతురు మీరా చివరిగా ధరించిన కేవలం నాలుగు వేల రూపాయల వాచ్‌ను మాత్రమే విజయ్ ఆంటోని నిరంతరం వాడుతున్నారని ఫాతిమా పేర్కొన్నారు. ప్రస్తుతం బిక్షగాడు హీరో గురించి ఆయన భార్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us