‘అల వైకుంఠపురములో’ మ్యూజిక్ కన్సర్ట్ వేదికగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. తన తండ్రి అల్లు అరవింద్ గురించి మాట్లాడిన బన్నీ.. తట్టుకోలేక స్టేజ్‌పైనే కంట తడి పెట్టుకున్నారు. ఇది ఫంక్షన్‌కు వచ్చిన అందరినీ కదిలించింది. అయితే ఈ సందర్భంగా అల్లు అరవింద్‌పై కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు బన్నీ. ‘‘చాలా మంది అల్లు అరవింద్ గారు చాలా డబ్బులు కొట్టేసేవారని అంటుంటారు. కానీ ఆయన ఎలాంటి వారో నాకు తెలుసు. దాదాపుగా 45ఏళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో, ఇండియాలోనే మంచి నిర్మాతల్లో అల్లు అరవింద్ కచ్చితంగా ఉంటారు’’ అంటూ చెప్పుకొచ్చారు బన్నీ. దీంతో అక్కడున్న అందరూ కూడా కాస్త భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఉన్నట్లుండి అల్లు అరవింద్ గురించి బన్నీ ఎందుకు అంత భావోద్వేగానికి గురయ్యారు..? అల్లు అరవింద్‌పై బన్నీ చేసిన వ్యాఖ్యలు ఎవరికి కౌంటర్ ఇచ్చేందుకు..? అన్న చర్చ టాలీవుడ్‌లో జరుగుతోంది. అయితే ఒకప్పుడు స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీసిన అల్లు అరవింద్.. ఈ మధ్య చిన్న చిన్న హీరోలతో సరిపెట్టుకుంటున్నారు. ఇక చిరు రీ ఎంట్రీ తరువాత ఆయనతో సినిమాలు తీద్దామని అనుకున్నప్పటికీ.. కొన్ని కారణాల వలన కుదరడం లేదన్న విషయం తెలిసిందే.