Daggubati Abhiram: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి.. త్వరలోనే హీరో అభిరామ్ వివాహం.. అమ్మాయి ఎవరో తెలుసా?

|

Sep 09, 2023 | 5:46 PM

దగ్గుబాటి ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. నిర్మాత సురేష్‌ బాబు రెండో తనయుడు, రానా సోదరుడు హీరో అభిరామ్‌ పెళ్లి ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయని టాక్‌ వినిపిస్తోంది. అయితే అభిరామ్‌ పెళ్లి ఇండియాలో కాకండా శ్రీలంకలో గ్రాండ్‌గా జరగనుందట. డిసెంబర్‌ 6న యంగ్‌ హీరో వివాహం జరగనుందని వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం శుభలేఖలను కూడా వినూత్నంగా డిజైన్‌ చేయిస్తున్నారట. కారంచేడులో దివంగత రామానాయుడు ఉన్న పాత ఇల్లు డిజైన్‌ను శుభలేఖల మీద

Daggubati Abhiram: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి.. త్వరలోనే హీరో అభిరామ్ వివాహం.. అమ్మాయి ఎవరో తెలుసా?
Daggubati Family
Follow us on

దగ్గుబాటి ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. నిర్మాత సురేష్‌ బాబు రెండో తనయుడు, రానా సోదరుడు హీరో అభిరామ్‌ పెళ్లి ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయని టాక్‌ వినిపిస్తోంది. అయితే అభిరామ్‌ పెళ్లి ఇండియాలో కాకండా శ్రీలంకలో గ్రాండ్‌గా జరగనుందట. డిసెంబర్‌ 6న యంగ్‌ హీరో వివాహం జరగనుందని వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం శుభలేఖలను కూడా వినూత్నంగా డిజైన్‌ చేయిస్తున్నారట. కారంచేడులో దివంగత రామానాయుడు ఉన్న పాత ఇల్లు డిజైన్‌ను శుభలేఖల మీద అచ్చువేయిస్తున్నారని వినిపిస్తోంది. ఇదే కాదు కారంచేడు లోని దగ్గుబాటి కుటుంబానికి అనుబంధంగా ఉన్న మరికొన్ని గుర్తులు కూడా శుభలేఖలమీద కనపడనున్నాయట. ఈ పెళ్లితో దగ్గుబాటి కుటుంబ సభ్యులందరూ ఒక దగ్గరకు చేరుతున్న తరుణంలో, రామానాయుడు పాత గుర్తులన్నీ శుభలేఖల మీద కనిపించేలా డిజైన్‌ చేయిస్తున్నారట. ఇక అభిరామ్‌తో జీవితం పంచుకోనున్న అమ్మాయి ఎవరో తెలుసా? వాళ్ల బంధువులమ్మాయే.. సురేష్‌ బాబు చెల్లెలి కూతురుతోనే అభిరామ్‌ పెళ్లిపీటలెక్కనున్నాడు. ప్రస్తుతం ఆమె కుటుంబమంతా కారంచేడులోనే ఉంది. అభిరామ్‌, ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒకరికొకరు ఇష్టపడుతున్నారని, వీరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు కూడా ఆశీర్వదించారని, ఇక పెళ్లే తరువాయి అని తెలుస్తోంది. దివంగత రామానాయుడు కోరిక కూడా ఇదేనని, ఆ ప్రకారమే అభిరామ్‌ వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.

కాఫీ షాపు ఓపెన్‌ చేసే పనిలో..

ఇక సినిమాల విషయానికొస్తే.. దగ్గుబాటి అభిరామ్‌ హీరోగా నటించిన సినిమా అహింస. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర పెద్దగా ఆడలేకపోయింది. అయితే తన రెండో సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. మరోవైపు అభిరామ్ మాత్రం ఒక కాఫీ షాప్‌ ఓపెన్‌ చేసే పనిలో ఉన్నాడట. రామానాయుడు స్టూడియో పక్కనే రైటర్స్‌ కాఫీ షాప్‌ పేరిట ఓపెన్‌చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ఇక అభిరామ్‌ అన్నయ్య దగ్గుబాటి రానా పెళ్లి 2020లో జరిగింది. మిహికా బజాజ్‌తో కలిసి రానా ఏడడుగులు వేశాడు. ఇప్పుడు అభిరామ్‌ కూడా ఓ ఇంటివాడవుతున్నాడు.

భార్య మిహికా బజాజ్ తో దగ్గుబాటి రానా..

మిహీకా బజాజ్ ఇన్ స్టాగ్రామ్ ఫొటోస్ 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.