అప్పుడు అన్నయ్య సినిమాలో.. ఇప్పుడు తమ్ముడు మూవీలో కీలక పాత్రలో ఆ స్టార్ డైరెక్టర్..

|

Feb 06, 2021 | 9:11 PM

టాలీవుడ్ దర్శకుల్లో చాలా మంది డైరెక్టర్స్ అప్పుడప్పుడు వెండితెరపై కన్పిస్తుంటారు. తాము తెరకెక్కించే సినిమాల్లో గెస్ట్ రోల్స్‏లో వస్తుంటారు. ఇప్పటికే దర్శదీరుడు రాజమౌళి, వి.వి వినాయక్ లాంటి

అప్పుడు అన్నయ్య సినిమాలో.. ఇప్పుడు తమ్ముడు మూవీలో కీలక పాత్రలో ఆ స్టార్ డైరెక్టర్..
Follow us on

టాలీవుడ్ దర్శకుల్లో చాలా మంది డైరెక్టర్స్ అప్పుడప్పుడు వెండితెరపై కన్పిస్తుంటారు. తాము తెరకెక్కించే సినిమాల్లో గెస్ట్ రోల్స్‏లో వస్తుంటారు. ఇప్పటికే దర్శదీరుడు రాజమౌళి, వి.వి వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్స్ వెండి తెరపై ప్రత్యక్షమయ్యారు. గతంలో చిరంజీవి నటించిన ఠాగూర్, ఖైదీ నంబర్ 150 సినిమాల్లో గెస్ట్ రోల్లో నటించాడు వి.వి వినాయక్. తాజాగా ఆయన మరో సినిమాలో నటిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కోషియమ్ తెలుగు రీమేక్ షూటింగ్‏లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో పవన్‏తోపాటు హీరో రానా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో వి.వి వినాయక్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలిస్తోంది. ఇప్పటీకే ఈ సినిమా చిత్రీకరణలో ఈ స్టార్ డైరెక్టర్ పాల్గొన్నాడట. ఇటీవల గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగిన షూటింగ్లో ఆయన పాల్గొన్నట్లుగా సమాచారం.

Also Read:

The Family man -2: మళ్లీ వాయిదా పడిన సమంత వెబ్ సిరీస్.. ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ విడుదల ఎప్పుడంటే..