రవితేజతో వినాయక్.. మళ్ళీ హిట్ కొడతారా.?

|

Apr 15, 2019 | 4:41 PM

దర్శకుడు వి.వి.వినాయక్, హీరో రవితేజతో కలిసి ఒక సినిమా చేస్తాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే స్క్రిప్ట్ లేట్ అయ్యేసరికి సినిమా పోస్ట్‌పోన్ కావాల్సి వచ్చింది. కాగా తాజా సమాచారం ప్రకారం వినాయక్ తన కథను రవితేజకు వినిపించారని.. రవితేజ కూడా ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్ళనున్నట్లు సమాచారం. కాగా గతంలో వీరి కాంబినేషన్ లో ‘కృష్ణ’ అనే సినిమా వచ్చి.. సూపర్ […]

రవితేజతో వినాయక్.. మళ్ళీ హిట్ కొడతారా.?
Follow us on

దర్శకుడు వి.వి.వినాయక్, హీరో రవితేజతో కలిసి ఒక సినిమా చేస్తాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే స్క్రిప్ట్ లేట్ అయ్యేసరికి సినిమా పోస్ట్‌పోన్ కావాల్సి వచ్చింది. కాగా తాజా సమాచారం ప్రకారం వినాయక్ తన కథను రవితేజకు వినిపించారని.. రవితేజ కూడా ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్ళనున్నట్లు సమాచారం. కాగా గతంలో వీరి కాంబినేషన్ లో ‘కృష్ణ’ అనే సినిమా వచ్చి.. సూపర్ హిట్ అయ్యింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమాతోనైనా వినాయక్ హిట్  కొడతాడేమో వేచి చూడాలి.