Vithika Sheru: బిగ్బాస్ సీజన్ 3 కంటెస్టె్ంట్, హీరో వరుణ్ సందేశ్ భార్య వితికా షెరు తన చెల్లెలి వివాహాన్ని సోమవారం ఘనంగా జరిపించారు. తాజాగా తన చెల్లి గురించి వితికా తన ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ ట్వీట్ చేశారు.
కృతికా షెరు.. నా బంగారు తల్లి, నీ పెళ్లి గురుంచి, నా పెళ్ళి కంటే ఎక్కువ కలలు కన్నాను. అందుకే కష్టపడి, చాలా ఇష్పపడి నీ పెళ్ళి చేసాను. నువ్వు నాకు చెల్లిలా పుట్టావు. కానీ నేను నిన్ను తల్లిలా పెంచుకున్నాను. నీ పెళ్ళి గురించి నేను 20 ఏళ్ళుగా కలలు కంటునే ఉన్నాను. ఆ కళ నిజమైనందుకు, నీ పెళ్ళిని నేనే చేసినందుకు నాకు గర్వంగా ఉంది. నీకు నేను ఎప్పుడు అండగా ఉంటాను. నువ్వు జీవితంలో ఎంతో ఎదగాలని.. నీకు నా అవసరం కానీ, ఇతరుల అవసరం కానీ రాకూడదని కోరుకుంటున్నాను. నువ్వు కొత్త ఇల్లు కొనుక్కొవాలి. నువ్వు కోరుకున్నవన్ని జరగాలి. ఐ లవ్ యు. ఇప్పటి నుంచి నువ్వు చేసే ప్రతి నేను గర్వపడేలా చేయాలి. నీ వైవాహిక జీవితానికి నా శుభాకాంక్షలు. ఆ దేవుడు మీ ఇద్దరిని చల్లగా చూడాలి. క్రిష్ బాగా చూస్కో అంటూ వితికా తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఇక బిగ్బాస్ సీజన్ 3 వితికా, వరుణ్ ఇద్దరు కూడా పాల్గొన్నారు.
‘నిన్ను మిస్ అవుతున్నా’.. సుదీర్పై ఆ టాప్ యాంకర్ ఆసక్తికర కామెంట్స్.. వైరల్గా మారిన వీడియో..