Celebrity: ఆ ఫోటోలను తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి..

Celebrity: తనను ట్రోల్ చేస్తున్న నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నటి, క్యాన్సర్ బారిన పడిన ఛవీ మిట్టల్. ఇటీవల క్యాన్సర్ భారిన ఛవీ మిట్టల్..

Celebrity: ఆ ఫోటోలను తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి..
Chhavi Mittal

Updated on: Jul 17, 2022 | 9:10 PM

Celebrity: తనను ట్రోల్ చేస్తున్న నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నటి, క్యాన్సర్ బారిన పడిన ఛవీ మిట్టల్. ఇటీవల క్యాన్సర్ భారిన ఛవీ మిట్టల్.. క్యాన్సర్‌ను ఎదుర్కొనేలా మోటివేట్ చేస్తూ కొన్ని పోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో ఛవీ మిట్టర్ ఎద భాగం కనిపించేలా ఉంది. అయితే, ఈ ఫోటోలపై కామెంట్స్ చేస్తూ నెటిజన్లు ట్రోల్ చేశారు. విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. అయితే, ఆ కామెంట్స్‌పై సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది ఛవీ మిట్టల్. ఈ విమర్శలకు కౌంటర్ ఇస్తూ సుధీర్ఘమైన పోస్టును ఇన్‌స్టాగ్రమ్‌లో పెట్టింది.

‘‘నేను సోషల్ మీడియాలో షేర్ చేసిన 2 ఫోటోలు ఇక్కడ ఉన్నాయి. మొదటిది నా రొమ్ము క్యాన్సర్ ప్రకటన పోస్ట్. రెండవది నా పోస్ట్-క్యాన్సర్ రికవరీ, పురోగతిని డాక్యుమెంట్ చేయడానికి సంబంధించినది. రెండు చిత్రాలలో, నేను సరైన డ్రెస్‌నే ధరించాను. రెండింటిలోనూ నా ఎద కొంచెం కనిపిస్తుంటుంది. నిజానికి, మొదటి ఫోటోలో నేను నా టీ-షర్టును తీసివేసాను. క్యాన్సర్ ప్రకటన పోస్ట్‌లో నా ఎద ఎక్కువ కనిపించి ఉండొచ్చు. నేను భావోద్వేగానికి గురయ్యాను. క్యాన్సర్ గురించి, మున్ముందు ఏం జరుగుతుందో అనే భయంతో పోరాడటానికి ప్రయత్నిస్తున్నాను. నేను మళ్లీ ఎప్పటిలాగే ఉంటానా, లేదా రాజీపడే జీవితాన్ని గడుపుతానా.. ఈ నెటిజన్ల నుండి చాలా ప్రేమ, ప్రశంసలు లభించాయి. చాలా మంది ధైర్యం చెప్పారు.’’ అని ఛవీ మిట్టల్ పేర్కొంది.

తాను బాధపడకుండా తన విజయాన్ని పంచుకుంటూనే ఉంటానని, తన ఫోటోలు ఇతరులకు ధైర్యాన్ని ఇచ్చాయని చెప్పుకొచ్చింది. అయితే, తరువాత పోస్ట్ చేసిన ఫోటోలో చాలా మంది వేరే విషయాలను ప్రాధాన్యత ఇచ్చారంది. ఎందుకంటే.. క్యాన్సర్ బాధితులు ఎంత బాధపడతారో తనకు మాత్రమే తెలుసునంది. ప్రాణాలతో బటయపడటమే కాకుండా.. అన్ని విధాలుగా యోధులుగా ఉండటం కూడా తెలుసునని, ఈ వివరణ మూర్ఖుల కోసం కాదని ఛవీ మిట్టల్ పేర్కొంది. కాగా, ఛవీ మిట్టల్‌కు ఈ ఏడాది ప్రారంభంలో రొమ్ము క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. చికిత్స అనంతరం ఛవీ రికవరీ అయ్యింది.


మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..