శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో తెరెక్కుతోన్న చిత్రం విమానం. సముద్ర ఖని, అనసూయ భరద్వాజ్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై భారీగానే అంచనాలు ఉన్నాయి. నిజానికి తొలుత ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ, ఫస్ట్ లుక్, గ్లింప్స్ తర్వాత అంచనాలు పెరిగాయి. తండ్రి కొడుకుల మధ్య జరిగే ఓ ఎమోషనల్ జర్నీగా ఈ సినిమాను తెరకెక్కించారు. చిన్ననాటి నుంచి విమానం ఎక్కాలనే కోరిక ఉన్న ఓ కుర్రాడు, అంగవైకల్యంతో వీల్ చెయిర్‌కే పరిమితమైన తండ్రి మధ్య జరిగిన భావోద్వేగాలతో కూడిన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.
జూన్ 9వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. 1.34 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. అంగవైకల్యంతో బాధపడే వీరయ్య.. తన కొడుకుని ఎంతో ప్రేమగా చూసుకుంటుంటాడు. వీరయ్య కొడుక్కి మాత్రం ‘విమానం’ అంటే పిచ్చి. తండ్రిని విమానం ఎక్కించమని బతిమలాడుతుంటాడు. అసలు ఆ కుర్రాడు పెద్దయ్యాక ఏమయ్యాడు.? విమానం ఎక్కాడా లేదా.? లాంటి అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇక టీజర్ విషయానికొస్తే మనసును తట్టిలేపేలా ఉంది. విలన్‌గా కనిపించి భయపెట్టే సముద్ర ఖని ఈ సినిమాలో ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయాడు. డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చిన్నారి చెప్పే.. ‘అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు.. నాన్నా అంటారు’ అనే డైలాగ్ బాగుంది. ఇంతకీ ఈ సినిమా అసలు కథ ఏంటి.? డైరెక్టర్ తండ్రీ, కొడుకుల ఎమోషన్‌ను తెరపై ఎలా చూపించాడో తెలియాలంటే జూన్ 9వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..