మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆయనకు సంబంధించిన రెండు ఫస్ట్‌లుక్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో రాయనమ్ అనే పాత్రలో విజయ్ సేతుపతి కనిపించబోతుండగా.. ఓ లుక్‌లో కారు పక్కన, మరో లుక్‌లో సిగరెట్ తాగుతూ కనిపించారు విజయ్ సేతుపతి. చూస్తుంటే ఆయన పాత్ర సినిమాకు పెద్ద అస్సెట్ అవ్వనున్నట్లు అర్థమవుతోంది.
కాగా ప్రేమ కథాంశంతో ఉప్పెన తెరకెక్కింది. ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన క్రితి శెట్టి నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇటీవల వచ్చిన ఉప్పెన ఫస్ట్‌వేవ్ ఆకట్టుకోవడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఏప్రిల్ 2న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శంకర్‌దాదా ఎంబీబీఎస్, అందరివాడు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇదివరకే ప్రేక్షకులకు పరిచయమైన వైష్ణవ్ తేజ్.. ఈ మూవీతో హీరోగా తానేంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు.
Makkal selvan @VijaySethuOffl as 'Rayanam' from #Uppena ?#UppenaOnApril2nd ?#PanjaVaisshnavTej, @iamKrithiShetty #BuchiBabuSana
A Rockstar @ThisIsDSP Musical ? pic.twitter.com/gd68vzVzj6
— Mythri Movie Makers (@MythriOfficial) February 10, 2020
Makkal Selvan @VijaySethuOffl as 'Rayanam' from #Uppena ?#UppenaOnApril2nd ?#PanjaVaisshnavTej, @iamKrithiShetty #BuchiBabuSana
A Rockstar @ThisIsDSP Musical ? pic.twitter.com/jay8xDsCWv
— Mythri Movie Makers (@MythriOfficial) February 10, 2020