సేతుపతి.. ఆ సినిమా నుంచి తప్పుకున్నాడా.?

పంజా వైష్ణవ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ నూతన దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉప్పెన’. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల అందుతున్న సమాచారం బట్టి విజయ్ సేతుపతి […]

సేతుపతి.. ఆ సినిమా నుంచి తప్పుకున్నాడా.?
Ravi Kiran

|

Jul 29, 2019 | 7:30 PM

పంజా వైష్ణవ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ నూతన దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉప్పెన’. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల అందుతున్న సమాచారం బట్టి విజయ్ సేతుపతి ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉండగా.. ‘ఉప్పెన’ టీమ్‌కు ఇది గట్టి దెబ్బనే చెప్పాలి. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో హీరో వైష్ణవ్ తేజ్ జాలరి పాత్రలో కనిపించనున్నాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu